China Restaurant Blast Video: చైనాలో భారీ పేలుడు, రెస్టారెంట్లో గ్యాస్ పేలి చెలరేగుతున్న మంటలు, చుట్టుపక్కల భవనాలు, వాహనాలు పూర్తిగా ధ్వంసం (వీడియో ఇదుగో)
చైనా రాజధాని బీజింగ్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని యాంజియావోలో (Yanjiao) బుధవారం ఉదయం 7.55 గంటలకు(చైనా కాలమానం ప్రకారం)భారీ పేలుడు (Explosion) సంభవించింది. ఓ పాత నివాసభవనంలోని కింది అంతస్తులో ఉన్న రెస్టారెంట్‌లో గ్యాస్ పేలుడు (China Blast) సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
Beijing, March 13: చైనా రాజధాని బీజింగ్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని యాంజియావోలో (Yanjiao) బుధవారం ఉదయం 7.55 గంటలకు(చైనా కాలమానం ప్రకారం)భారీ పేలుడు (Explosion) సంభవించింది. ఓ పాత నివాసభవనంలోని కింది అంతస్తులో ఉన్న రెస్టారెంట్‌లో గ్యాస్ పేలుడు (China Blast) సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. భవనాల శిధిలాలు ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు తర్వాత (Yanjiao) భారీ నీలి మంటలు ఎగిసిపడినట్లు వీడియోలో కనిపిస్తోంది.
JUST IN: Large explosion at restaurant in Yanjiao, China. Reports of casualties pic.twitter.com/ki7oRSHIIz
— BNO News (@BNONews) March 13, 2024
ఈ పేలుడులో ఎంత మంది చనిపోయారో వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. రెస్క్యూటీమ్ సహాయక చర్యలు మొదలు పెట్టింది.
(The above story first appeared on LatestLY on Mar 13, 2024 08:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

