Trump Concluded India Visit: రెండు రోజుల భారత పర్యటన ముగించుకొని స్వదేశానికి పయనమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ
రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం ముగియగానే, ట్రంప్ ఫ్యామిలీ నేరుగా దిల్లీ విమానాశ్రయం చేరుకుని వారి ప్రత్యేక విమానంలో తిరిగి తమ స్వదేశానికి పయనమయ్యారు......
New Delhi, February 26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరియు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తమ తొలి రెండు రోజుల భారత పర్యటనను ముగించుకొని (Concludes India Visit) మంగళవారం రాత్రి అమెరికాకు బయలుదేరిపోయారు. రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం ముగియగానే, ట్రంప్ ఫ్యామిలీ నేరుగా దిల్లీ విమానాశ్రయం చేరుకుని వారి ప్రత్యేక విమానంలో తిరిగి తమ స్వదేశానికి పయనమయ్యారు.
. డొనాల్డ్ ట్రంప్ దిల్లీ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు మరియు ప్రథమ మహిళ మెలానియాకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి భారత పర్యటన సరికొత్త ఆవిష్కరణలకు నాందిగా అభివర్ణించారు. ఇరు దేశాల "ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా గొప్ప పునాది ఏర్పరచాము. భారతదేశం-యుఎస్ఎ స్నేహం ఇరు దేశాలకే కాకుండా ప్రపంచ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాని ట్వీట్ చేశారు.
అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన విందు సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ట్రంప్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇరుదేశాల ప్రజల సుఖసంతోషాలను ఆకాంక్షించారు. విందుకు వచ్చిన అతిథులను రామ్ నాథ్ కోవింద్, ట్రంప్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ట్రంప్ కరచాలనం చేశారు, కేసీఆర్ తనకు తానుగా ట్రంప్‌కు పరిచయం చేసుకున్నారు.
ఇక ట్రంప్ భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య 3 అవగాహన ఒప్పందాలు (MoUs) సంతకం చేయబడ్డాయి. 1. మానసిక ఆరోగ్యంపై అవగాహన ఒప్పందం 2. భద్రత మరియు ఔషధాలు 3. ఇంధన వనరులకు సంబంధించి ఐయోసి మరియు ఎక్సాన్ మధ్య సహకారం. ట్రంప్
తో నరేంద్ర మోదీ సమావేశం, కుదిరిన ఒప్పందాల పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
యూఎస్ నుంచి 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలను భారత్ ఖరారు చేసుకుంది. ఇందులో భాగంగా అధునాతనమైన అపాచీ మరియు ఎంహెచ్ -60 రోమియో హెలికాప్టర్లలను యూఎస్ నుంచి భారత్ కొనుగోలు చేయనుంది.