COVID-19 in US: అమెరికాలో ఒక్కరోజే 50 వేలకు పైగా కొత్త కేసులు, బ్రెజిల్‌లో 60 వేలు దాటిన కోవిడ్-19 మృతుల సంఖ్య, ప్రపంచవ్యాప్తంగా కోటి దాటిన కరోనా కేసులు

బుధవారం ఒక్కరోజే 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో(గురువారం) రికార్డు స్థాయిలో కొత్తగా 55 వేల కోవిడ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు (coronavirus Cases) ఏ దేశంలో కూడా నమోదు కాలేదని రాయిటర్స్‌ సంస్థ పేర్కొంది. అంతేగాక గత రెండు వారాల నుంచి అమెరికాలో రోజుకు 22 వేల కొత్త కేసులు నమోదవ్వగా 3 రోజుల నుంచి రెట్టింపుతో 40 వేలకుపైగా కొత్త కేసులు రికార్డు అవుతున్నాయి.

Coronavirus (Photo-PTI)

Washington, July 3: అగ్రరాజ్యం అమెరికాకు కరోనా విశ్వరూపం (COVID-19 in US) చూపిస్తోంది. బుధవారం ఒక్కరోజే 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో(గురువారం) రికార్డు స్థాయిలో కొత్తగా 55 వేల కోవిడ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు (coronavirus Cases) ఏ దేశంలో కూడా నమోదు కాలేదని రాయిటర్స్‌ సంస్థ పేర్కొంది. అంతేగాక గత రెండు వారాల నుంచి అమెరికాలో రోజుకు 22 వేల కొత్త కేసులు నమోదవ్వగా 3 రోజుల నుంచి రెట్టింపుతో 40 వేలకుపైగా కొత్త కేసులు రికార్డు అవుతున్నాయి. మాస్క్ ఉన్నా కరోనాతో డేంజరే, దేశంలో రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో 20,903 కొత్త కేసులు నమోదు, 6,25,439కు చేరిన మొత్తం కేసులు, ప్రపంచ వ్యాప్తంగా కోటి దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య

ఒక్క ఫ్లోరిడాలోనే అత్యధికంగా గురువారం దాదాపు 10 వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా (coronavirus disease) కట్టడికి అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో దేశ్యవాప్తంగా కరోనా కేసులు ఒక్కరోజే లక్షల్లో నమోదయ్యే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డీసీజేస్‌ హెడ్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ఇప్పటికే హెచ్చరించింది. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 28,37,189కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 1,31,485 మంది మరణించగా, 15,14,613 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 11,91,091 మంది కోలుకున్నారు.

ఇక బ్రెజిల్‌లో నిన్న ఒక్కరోజే 48,105 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసులు 15,01,353కు చేరింది. ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు 61,990 మంది మరణించారు. మొత్తం కేసుల్లో 5,23,216 మంది చికిత్స పొందుతుండగా, 9,16,147 మంది కోలుకున్నారు. గురువారం రోజు 1252 మంది బాధితులు మృతిచెందారు. ప్రపంచంలో అమెరికా తరువాత అత్యధిక కరోనా కేసులు నమోదైంది ఈ దేశంలోనే. ప్రపంచంలో కరోనా అకస్మాత్తుగా వ్యాపించిందని మార్చి 11న డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించగా నాటి నుంచి నేటివరకు ప్రపంచ వ్యాప్తంగా 10.5 మిలియన్ల మంది ఆ మహమ్మారి బారినపడ్డారు. వీరిలో 5లక్షల 13వేల మంది మృతి చెందినట్లు అమెరికాలోని హోప్కిన్స్‌ విశ్వవిద్యాలయం వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,09,85,656 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 5,24,088 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 61,40,827 మంది కోలుకున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif