IPL Auction 2025 Live

US Surgeon General Murthy: దయచేసి అందరూ వ్యాక్సిన్ వేసుకోండి, నేను కరోనాతో 10 మంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయా, కోవిడ్ ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే సాక్ష్యమని తెలిపిన అమెరికన్‌ సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి

వ్యాక్సిన్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాల్ని నమ్మవద్దని ఆయన కోరారు. కరోనా మహమ్మారి కారణంగా తాను పది మంది కుటుంబసభ్యులను (Lost 10 Family Members to Covid) కోల్పోయానని చెప్పారు.

Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

Washington, Jul 17: కరోనావ్యాక్సిన్‌పై నెలకొన్న అనుమానాలను వీడి, అందరూ టీకాలు వేసుకోవాలని భారత సంతతికి చెందిన అమెరికన్‌ సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి (US Surgeon General Murthy) ఆ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాల్ని నమ్మవద్దని ఆయన కోరారు. కరోనా మహమ్మారి కారణంగా తాను పది మంది కుటుంబసభ్యులను (Lost 10 Family Members to Covid) కోల్పోయానని చెప్పారు. ఈ మహమ్మారి (Coronavirus) ఎంత ప్రమాదకరమైందో తెలియజేసేందుకు ఇదే పెద్ద ఉదాహరణ అని అమెరికా సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి చెప్పారు. వీళ్లలో కొందరు అమెరికాలో, మరికొందరు భారత్‌లో నివసించేవారన్నారు.

ఇప్పటివరకూ 16 కోట్ల మంది అమెరికన్లు టీకాలు వేసుకున్నారని, ఇది గొప్ప విషయమని పేర్కొన్నారు. అయితే, దేశ ప్రజలందరికీ టీకా (Covid Vaccine) రక్షణ లభిస్తేనే మహమ్మారికి కళ్లెం పడుతుందని తెలిపారు. మనం చూస్తున్న ప్రతీ కరోనా మరణాన్ని వ్యాక్సిన్‌తో అడ్డుకొని ఉండేవాళ్లమని చెప్పారు. వ్యాక్సిన్‌పై అనుమానాలు నివృత్తి చేసేందుకు ఉద్దేశించిన ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఆయన.. ఆరోగ్య సంబంధ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో షేర్‌ చేసేటప్పుడు దానికి విశ్వసనీయమైన శాస్త్రీయ ఆధారాలున్నాయేమో పరిశీలించాలని కోరారు.

వ్యాక్సిన్ వేసుకున్నా ముంచుకొస్తున్న థర్డ్ వేవ్ ముప్పు, రానున్న 100 రోజులే కరోనాకు అత్యంత కీలకం, హెచ్చరించిన కేంద్ర ఆరోగ్యశాఖ, దేశంలో తాజాగా 38,079 మందికి కోవిడ్, చాలా దేశాల్లో ఇప్పటికే మొదలైన కరోనా థర్డ్ వేవ్

ఇప్పటి వరకు 48.5% మంది అంటే.. సుమారు 16 కోట్ల మంది ప్రజలు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడం శుభ పరిణామమే అయినప్పటికీ, మహమ్మారి ముప్పు తొలిగినట్లు కాదన్నారు. టీకా వేయించుకోని ఎక్కువ మంది వైరస్‌ బారినపడు తున్నారని చెప్పారు. కోవిడ్‌తో సంభవించే ప్రతి మరణం ప్రస్తుతం నివారించగలిగినదే అని పేర్కొన్నారు. కాగా, మే నెలలో కైజర్‌ ఫ్యామిలీ ఫౌండేషన్‌ చేపట్టిన సర్వే ప్రకారం..15% మంది వేచిచూసే ధోరణిలో ఉండగా, 19% మంది మరీ అవసరమైతే తప్ప కనీసం ఒక్క డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు తేలింది. అమెరికాలో గత కొన్ని వారాలుగా రోజుకు సగటున సుమారు 24 వేల కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి.



సంబంధిత వార్తలు

Vaibhav Suryavanshi: 13 ఏళ్లకే ఐపీఎల్ మెగా వేలంలోకి, వైభవ్ సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

Ambati Rambabu: అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయరా ? పోలీసులకు సూటి ప్రశ్న విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు

Covid-Cancer Link: కరోనా మంచే చేస్తున్నది.. ప్రాణాంతక క్యాన్సర్ పని పడుతున్నది.. క్యాన్సర్‌ కణాలపై పోరాడే ప్రత్యేక మోనోసైట్లను ఉత్పత్తి చేస్తున్న కొవిడ్.. ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

YS Sharmila: జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన వైఎస్‌ షర్మిల, ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు..ఇదంతా చేయించింది జగనే...అప్పుడు ఎందుకు ఎంక్వైరీ అడగలేదో చెప్పాలని షర్మిల డిమాండ్