COVID in India: వ్యాక్సిన్ వేసుకున్నా ముంచుకొస్తున్న థర్డ్ వేవ్ ముప్పు, రానున్న 100 రోజులే కరోనాకు అత్యంత కీలకం, హెచ్చరించిన కేంద్ర ఆరోగ్యశాఖ, దేశంలో తాజాగా 38,079 మందికి కోవిడ్, చాలా దేశాల్లో ఇప్పటికే మొదలైన కరోనా థర్డ్ వేవ్
Image used for representational purpose. | (Photo credits: PxFuel)

New Delhi, July 17: దేశంలో తాజాగా 19,98,715 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 38,079 మందికి వైరస్‌ పాజిటివ్‌గా (COVID in India) తేలింది. ముందురోజు కూడా 38వేల కేసులే నమోదయ్యాయి. తాజాగా 560 మంది మహమ్మారికి బలయ్యారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం కేసులు 3.10కోట్లకు చేరగా.. 4,13,091 మంది ప్రాణాలు (Covid Deaths in India) కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా మూడోవేవ్ (Coronavirus Third Wave) ప్రారంభదశలో ఉందని ఇదివరకే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రానున్న 100 రోజులు అత్యంత కీలకమని కేంద్రం స్పష్టం చేసింది. కొవిడ్ నిబంధనల విషయంలో ఏ మాత్రం అలసత్వం వద్దని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం 4,24,025 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.39 శాతానికి తగ్గగా.. రికవరీరేటు 97.31 శాతానికి పెరిగింది. నిన్న 43వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.02కోట్ల మంది వైరస్‌ను జయించారు. అలాగే నిన్న 42.12లక్షల మంది టీకా వేయించుకోగా.. మొత్తం సంఖ్య 39.96కోట్లకు చేరింది.

రెండు కంపెనీల వ్యాక్సిన్లు తీసుకోవద్దు, వ్యాక్సిన్ మిక్సింగ్ చాలా ప్రమాదకరమని తెలిపిన డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథ‌న్, పరిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారుతుంద‌ని హెచ్చరిక

ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్‌వేవ్‌ ప్రారంభమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రానున్న 100 రోజులు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్యశాఖ (Health ministry) స్పష్టం చేసింది. ప్రపంచంలో చాలా దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని.. భారతీయులు బాధ్యతగా వ్యవహరించి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది.

ప్రపంచ దేశాలు థర్డ్‌వేవ్‌ వైపు వెళుతున్నాయి. ఉత్తర, దక్షిణ అమెరికాలు తప్పితే మిగతా ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. అందుచేత దీన్ని హెచ్చరిక (రెడ్‌ ఫ్లాగ్‌)గా భావించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సూచించారు. ముఖ్యంగా థర్డ్‌వేవ్‌ను ఆపాలనే లక్ష్యాన్ని మాకు నిర్దేశించారు. ఇది వాస్తవంగా సాధ్యమైనదే’ అని నీతి ఆయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వీకే పాల్‌ పేర్కొన్నారు.

స్పెయిన్‌లో కరోనా వైరస్‌ వారపు కేసుల్లో 64 శాతం, నెదర్లాండ్‌లో 300శాతం పెరిగాయి. థాయిలాండ్‌లో చాలా రోజులుగా పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నప్పటికీ తాజాగా అక్కడ మరోసారి వైరస్‌ ఉద్ధృతి పెరిగింది. ఆఫ్రికాలోనూ పాజిటివ్‌ కేసుల్లో 50 శాతం పెరుగుదల కనిపిస్తోంది. మయన్మార్‌, బంగ్లాదేశ్, మలేసియా, ఇండోనేసియా దేశాల్లో ఊహించని విధంగా వైరస్‌ తీవ్రత పెరుగుతోందని వీకే పాల్‌ గుర్తుచేశారు.

కరోనా షాక్..వృద్ధురాలిపై ఒకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్ల దాడి, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన బెల్జియం మహిళా వృద్ధురాలు, రెండు వేరియంట్లు ఎలా సోకాయనే విషయం అంతుచిక్కడం లేదని తెలిపిన నివేదిక

ఇదిలా ఉంటే కరోనా వేరియంట్ల విజృంభణ, ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసులు, మరణాల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కొత్త రకాల వ్యాప్తి మహమ్మారిని నిలువరించడాన్ని క్లిష్టతరం చేస్తోందని వెల్లడించింది. ‘ఏ దేశంలోనూ మహమ్మారి ముగింపునకు రాలేదు. కొత్త, ప్రమాదకరమైన వేరియంట్లు వైరస్ ఉద్ధృతికి దోహదం చేస్తున్నాయి. వాటిని నియంత్రించడం సవాలుగా మారొచ్చు’ అంటూ హెచ్చరించింది

థ‌ర్డ్ వేవ్ కేసులు అమెరికాలో గ‌త 25 రోజుల్లో కొత్త కేసులు 350 శాతం పెరిగాయి. అయితే, ఈ ప్రాంతాల్లో వ్యాక్సినేష‌న్ మంద‌గించింది. ఆసియా ఖండంలో ఇండోనేషియా థ‌ర్డ్‌వేవ్‌కే ప్ర‌ధాన కేంద్రంగా మారింది. ఇక మ‌హ‌మ్మారి వెలుగు చూసిన త‌ర్వాత స్పెయిన్‌లో తొలిసారి 44 వేల కేసులు రికార్డ‌య్యాయి. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా ఇన్‌ఫెక్ష‌న్లు సోకిన దేశాల్లో ఐదో స్థానంలో ఉన్న స్పెయిన్‌లో స‌గానికి పైగా జ‌నాభా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. స్పెయిన్‌లో తొలిసారి ఈ నెల 13న 43,960 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఒక రోజులు 44 వేల కేసులు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టి సారి. సెకండ్ వేవ్‌లో ఒక రోజులో జ‌న‌వ‌రి 15న‌ 35,378 కేసులు రికార్డ‌య్యాయి. ఫిబ్ర‌వ‌రి నుంచి కేసులు త‌గ్గినా జూలైలో క్ర‌మంగా పెరుగుతున్నాయి.

కలవరపెడుతున్న థర్డ్ వేవ్ ముప్పు, మహారాష్ట్రలో 8 జిల్లాల్లో కరోనా డేంజర్ బెల్స్

కేసులు పెరుగుతున్న ఫ్రాన్స్‌ను రెడ్ లిస్ట్‌లో చేర్చిన‌ట్లు బ్రిట‌న్ ప్ర‌క‌టించింది. బ్రిట‌న్‌, అమెరికాల్లో 11 రోజుల్లో రెట్టింపు కేసులు న‌మోదయ్యాయి. ఇక ఇండోనేషియాలో మూడు రెట్లు ఎక్కువ‌గా కొత్త కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. 48 శాతం జ‌నాభాకు వ్యాక్సినేష‌న్ జ‌రిగినా అమెరికాలోని 50కి 19 రాష్ట్రాల్లో కొత్త‌గా రెట్టింపు కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో లాస్ ఏంజిల్స్‌, ద‌క్షిణ కాలిఫోర్నియాల్లో ఇండోర్‌ల్లోనూ మాస్క్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి చేశారు. అధికారులు. గ‌త నెల 16 నుంచి ఇక్క‌డ మాస్క్‌ల వాడ‌కం ర‌ద్దు చేశారు.

న్యూయార్క్ టైమ్స్ క‌థ‌నం ప్ర‌కారం అమెరికాలో 16 కోట్ల మంది వ్యాక్సిన్లు వేసుకున్నారు. ఇది దేశ జనాభాలో సుమారు 48 శాతం. 10 కోట్ల మందికి మ‌హ‌మ్మారి ముప్పు పొంచి ఉంద‌ని మిన్నెసోటా యూనివ‌ర్సిటీలోని సెంట‌ర్ ఫ‌ర్ ఇన్‌ఫెక్ష‌న్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాల‌సీ డిపార్ట్‌మెంట్ డైరెక్ట‌ర్ మిఖైల్ ఓస్ట‌ర్‌హోల్మ్ వ్యాఖ్యానించారు. అమెరికాలో రోజూ 5.30 ల‌క్ష‌ల వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఏప్రిల్‌లో 33 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్లు వేశారు. గ‌త కొన్ని వారాలుగా మిస్సౌరి, ఆర్కాన్సాస్‌, నెవ‌డ రాష్ట్రాలు ఇన్‌ఫెక్ష‌న్ల‌కు న్యూ హాట్‌స్పాట్లుగా నిలిచాయి. గ‌త నెల‌లో ప్ర‌తి రోజూ 8000 కేసుల‌కు దిగి వ‌చ్చిన క‌రోనా.. తాజాగా 30 వేల మందికి పైగా సోకుతున్న‌ది.

న్యూ బేటా వేరియంట్ వైర‌స్ వెలుగు చూడ‌టంతో ఫ్రాన్స్‌ను రెడ్‌లిస్టులో ఉంచేందుకు బ్రిట‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ది. ఫ్రాన్స్ నుంచి వ‌చ్చే వారిపై ఆంక్ష‌లు విధిస్తున్న‌ది. ఫ్రాన్స్ నుంచి వ‌చ్చే వారిని హోట‌ల్ గ‌దుల్లో క్వారంటైన్ చేస్తున్న‌ది. ద‌క్షిణాఫ్రికాలో తొలి బేటా వేరియంట్ బ‌య‌ట‌ప‌డింది. ఇక ఆసియా ఖండంలో తాజా హాట్‌స్పాట్‌గా ఇండోనేషియా ఉంది. భారత్‌లో కంటే ఎక్కువ కేసులు న‌మోద‌వుతున్నాయి. గురువారం భార‌త్‌లో 39,071 కొత్త కేసులు న‌మోదైతే, ఇండోనేషియాలో 56,757 మందికి క‌రోనా సోకింది.