Vladimir Putin: ప్రియమైన వారిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది, భారత్‌లో వరదల విధ్వంసానికి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
"అనుకోని విపత్కర పరిస్థితులకు తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి బాధను రష్యా పంచుకుంటుంది. గాయపడిన వారందరినీ త్వరగా కోలుకోవాలని ఆశిస్తోంది" అని పుతిన్ (Vladimir Putin) సందేశంలో పేర్కొన్నారు.
Moscow, July 23: భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వరదల( India Floods) విధ్వంసం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి సూచకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Russian President Vladimir Putin) బుధవారం ప్రధాని మోడీ (PM Narendra Modi), దేశ అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ కు (President Ram Nath Kovind) సంతాపం తెలిపారు. ఈ మేరకు రష్యా అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. "అనుకోని విపత్కర పరిస్థితులకు తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి బాధను రష్యా పంచుకుంటుంది. గాయపడిన వారందరు త్వరగా కోలుకోవాలని రష్యా ఆశిస్తోంది" అని పుతిన్ (Vladimir Putin) తన సందేశంలో పేర్కొన్నారు. ఉగ్రరూపం దాల్చిన బ్రహ్మపుత్ర నది, అసోం వరదల్లో 85కు చేరిన మృతుల సంఖ్య, 70 లక్షల మందిపై వరదల ప్రభావం, అసోం సీఎం సోనోవాల్‌కు ప్రధాని మోదీ ఫోన్
అస్సాం, బీహార్ ఈ సంవత్సరం ఎప్పుడూ చూడని వరదలను చూస్తున్నాయి. అక్కడ వరదల విలయానికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు, ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగింది. అస్సాంలో వరదల విధ్వంసం (Assam Floods) బుధవారం కూడా కొనసాగుతూనే ఉంది. వివిధ నివేదికల మధ్య, రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని అనేక గ్రామాలు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయాయని పిటిఐ తెలిపింది. వరదల విలయం వల్ల పమరణించిన వారి సంఖ్య 113 కు పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. అస్సాం అంతటా 2,400 కి పైగా గ్రామాలు వరదల ప్రభావానికి ఇంకా లోనవుతున్నాయి. 44,000 మందికి పైగా సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందారు. వర్షం ఇంకా కొనసాగుతూ ఉండటంతో పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
Statement By Office of Russia's President:
ఇక బీహార్ లో (Bihar Floods) 10 జిల్లాల్లో 4.5 లక్షలకు పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. అయితే ఇప్పటివరకు అక్కడ ఎటువంటి మరణం నివేదించబడలేదు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్ ఎస్ ఎన్ ప్రధాన్ మాట్లాడుతూ అస్సాంలో మొత్తం 16 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను, బీహార్‌లో 20 బృందాలను మోహరించారు. అస్సాం మరియు బీహార్లలో వరద రక్షణ మరియు ఉపశమనం కోసం ఎన్డిఆర్ఎఫ్ "మిషన్ మోడ్" పై పనిచేస్తోంది, అయితే ఇది చాలా కష్టతరం అవుతుంది అని ఫోర్స్ చీఫ్ బుధవారం చెప్పారు. COVID-19 మహమ్మారి మధ్య వరదలతో జరిగిన యుద్ధం పోరాటాన్నిఇది మరింత కష్టతరం చేసింది. ఇంతలోనే మరో భారీ వర్షం అనేక ప్రాంతాలను నడుము లోతైన నీటిలో ముంచివేసింది. దేశ రాజధానిలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నాలుగు రోజుల్లో ఇది రెండవది,