Assam Floods (Photo Credits: PTI)

Guwahati, July 20: అసోంలో వ‌ర‌ద ఉధృతి (Assam Floods) తీవ్ర‌రూపం దాల్చింది. బ్రహ్మపుత్రా నది (Brahmaputra river) ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించడంతో అనేక వందలాది ఇళ్లు నీట మునిగాయి. వరదల ధాటికి ఇళ్లు, వంతెనలు నేలమట్టమయ్యాయి. దాదాపు 70వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు దాదాపు లక్ష క్వింటాళ్ల బియ్యం, 19,397 క్వింటాళ్ల కందిపప్పు, 173,006 లీటర్ల వంట నూనె అందజేసినట్టు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లో వరదలు, ముగ్గురు మృతి..పదకొండు మంది గల్లంతు

అసోం రాష్ట్రంలో భారీ వాన‌లు కురుస్తుండ‌టంతో 70 ల‌క్ష‌లపైగా మంది వ‌ర‌ద‌ల వ‌ల్ల‌ ప్ర‌భావిత‌మైన‌ట్లు ముఖ్య‌మంత్రి సోనోవాల్ స‌ర్బానంద సోనోవాల్ (Assam Chief Minister Sarbananda Sonowal) ప్ర‌క‌టించారు. వ‌ర‌ద‌ల‌వ‌ల్ల తాజాగా ఆరుగురు మ‌ర‌ణించ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 85 మంది మృతి ( Assam Flood Deaths) చెందార‌ని సీఎం తెలిపారు. ప్ర‌జ‌లు ఓవైపు క‌రోనాతో ఇబ్బంది ప‌డుతుండ‌గా, మ‌రోవైపు వ‌ర‌ద‌లు రాష్ట్రాన్ని అత‌లాకులం చేస్తున్నాయ‌ని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు అన్నివిధాలా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నాయ‌ని వెల్ల‌డించారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల నుంచి ప్ర‌జ‌లు, జంతువుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించామ‌న్నారు.

Here's ANI Video

అసోం వ‌ర‌ద ప‌రిస్థితిపై సీఎం సోనోవాల్‌తో ప్ర‌ధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఏ విధ‌మైన స‌హాయానికైనా కేంద్రం సిద్ధంగా ఉందని ప్ర‌ధాని హామీ ఇచ్చారు. బ్ర‌హ్మ‌పుత్రా న‌ది ఇప్ప‌టికే ప్ర‌మాద స్థాయిని దాటి (Brahmaputra Water Level) ప్ర‌వ‌హిస్తుండ‌గా, క‌చ‌ర్ జిల్లాలో బ‌రాక్ న‌ది ఉప్పొంది ప్ర‌వ‌హిస్తున్న‌ది. వ‌ర‌ద‌ల వ‌ల్ల తొమ్మిది ఖ‌డ్గ‌మృగాల‌తో స‌హా 108 జంతువులు చ‌నిపోయాయ‌ని రాష్ట్ర విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ ప్ర‌క‌టించింది.

అసోంలోని మొత్తం 26 జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. 2,700 గ్రామాల్లో జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.బ్రహ్మపుత్రా నదికి వరద పోటెత్తడంతో కజిరంగా జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 80 శాతం నీట మునిగింది. దీంతో మూగజీవాలు భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. వరద నీరు చుట్టుముట్టడంతో వన్యప్రాణులు జాతీయ రహదారిపైకి వచ్చి ప్రాణాలు నిలుపుకుంటున్నాయి. ఆదివారం మధ్యాహ్నంతో పోల్చితే సోమవారం రాత్రి నాటికి బ్రహ్మపుత్రా నదిలో నీటిమట్టం మరో 3 సెం.మీ.పెరుగనుందని కేంద్ర జలవనరుల కమిషన్ హెచ్చరించింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.