Pithoragarh, July 20: ఉత్తర, ఈశాన్యభారతదేశంలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పర్యాటక రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో కుండపోతగా వర్షాలు (Uttarakhand Cloudburst) కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు భారీ వరదలతో జలమయం అయ్యాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కొండ ప్రాంతాల నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు గ్రామాల్లోకి చేరుతోంది. నాలుగు రోజుల్లో 1.30 లక్షల కరోనా కేసులు నమోదు, దేశంలో 11 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు, 27,497కు చేరుకున్న మరణాలు
పిథోరాగ్ జిల్లాలోని ( Cloudburst in Pithoragarh) మడ్‌కట్ గ్రామంలోకి వచ్చిన వరద నీటిలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయి మృతి చెందారు. మరో పదకొండు మంది ఆ వరదల్లో చిక్కుకొని తప్పిపోయినట్లు మేజిస్ట్రేట్ వి.కె.జోగ్దాండే తెలిపారు. రెస్క్యూ బృందం (State Disaster Response Force) సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. వరదల్లో కొట్టుకుపోయిన వారిని గాలిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇక ఢిల్లీలో (Delhi Rains) ఆదివారం భారీ వర్షాలతో వరదలు పోటెత్తటంతో ఓ బాలుడు సహా నలుగురు వ్యక్తులు మరణించారు. మింటో బ్రిడ్జ్ అండర్‌పాస్‌లో మినీ ట్రక్ నీటిలో మునిగిపోవటంతో కుందన్ కుమర్ అనే డ్రైవర్ చనిపోయారు. నగరంలోని చాలా ఇండ్లల్లోకి భారీగా వరద నీరు చేసింది. ఐటీవో ప్రాంతంలో నాలాకు ఆనుకొని నిర్మిస్తున్న ఓ భవనం వరదనీటిలో కొట్టుకుపోయింది. ఉదయం 8.30వరకే నగరంలో 74.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణశాఖ తెలిపింది.
Here's Uttarakhand Cloudburst Video
#cloudburst in Uttarakhand's Tanga Village in #Pithoragarh , reports suggest 3 people burried under debris and 11 people yet to be traced. pic.twitter.com/9OLWxa2aro
— Utkarsh Singh (@utkarshs88) July 20, 2020
హిమాచల్‌ప్రదేశ్‌లో బద్‌సెరి అనే గ్రామం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు గోరి నది ఉప్పొంగటంతో నాలుగు ఇండ్లు కొట్టుకుపోయాయి. పితోర్‌గఢ్ సమీపంలోని మధ్‌కోట్ వద్ద ఉన్న బ్రిడ్జి వరదకు పాక్షికంగా కొట్టుకుపోయింది. ఇక భారీ వర్షాలు, వరదలకు ఈశాన్యరాష్ట్రం అసోం తల్లడిల్లుతున్నది. భారీ వరదలకు ఆదివారం ఐదుగురు మరణించటంతో ఈ ఏడాది వరదల కారణంగా మరణించినవారి సంఖ్య 79కి (Assam floods death toll rises to 79) చేరింది. 25లక్షల మది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకుగాను 24 జిల్లల్లో వరదల తీవ్రత అధికంగా ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌తో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ర్టాన్ని అన్నివిధాలుగా ఆదుకొంటామని హామీ ఇచ్చారు.