H1B Visa Policy 2025: అమెరికాకు టాలెంట్ ఉన్న విదేశీ ప్రతిభ అవసరం, మా దేశంలో అంత టాలెంట్ లేదు, హెచ్-1బీ వీసాలపై మళ్లీ యూటర్న్ తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
మన దగ్గర చాలా మంది ప్రతిభావంతులైన కార్మికులు ఉన్నారని విలేకరి ప్రశ్నించగా, ఆయన తక్షణమే లేదు, మన దగ్గర అంత ప్రతిభ లేదని స్పష్టంగా చెప్పారు. అమెరికా లోపల లభించే మానవ వనరులు పలు రంగాలలో సరిపడవని ఆయన అభిప్రాయపడ్డారు.
హెచ్-1బీ వీసాల (H-1B Visa) విషయంలో ఇప్పటివరకు కఠినమైన వైఖరిని ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పుడు తన స్వరాన్ని మార్చారు. అమెరికాలో విదేశీ ఉద్యోగులను నియమించడాన్ని నిరుత్సాహపరుస్తూ, స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ పలు సార్లు వ్యాఖ్యానించిన ట్రంప్ ఈసారి అందుకు విరుద్ధంగా స్పందించారు. అమెరికాకు విదేశీ ప్రతిభ అవసరమని, దేశాభివృద్ధికి బయటి నుంచి వచ్చే నైపుణ్యం కీలకమని ఆయన అంగీకరించారు.
ఫాక్స్ న్యూస్ (Fox News)కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. మన దగ్గర చాలా మంది ప్రతిభావంతులైన కార్మికులు ఉన్నారని విలేకరి ప్రశ్నించగా, ఆయన తక్షణమే లేదు, మన దగ్గర అంత ప్రతిభ లేదని స్పష్టంగా చెప్పారు. అమెరికా లోపల లభించే మానవ వనరులు పలు రంగాలలో సరిపడవని ఆయన అభిప్రాయపడ్డారు.అమెరికా పరిశ్రమలు, రక్షణ రంగాలు, టెక్నాలజీ విభాగాలు ఎదగాలంటే విదేశీ ప్రతిభ అవసరం. మన ఉద్యోగులు కూడా బయటి నుంచి వచ్చే వారి దగ్గర నైపుణ్యాలను నేర్చుకోవాలని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాలో ఇటీవల టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆ సందర్భంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు విశేషంగా మారాయి. ఆయన గతంలో హెచ్-1బీ వీసాలపై పన్నులు, ఫీజులు పెంచి కఠిన నియంత్రణలు విధించారు. అమెరికాలోని స్థానిక ఉద్యోగ అవకాశాలను రక్షించాలన్న ఉద్దేశ్యంతో ఈ చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రస్తుతం ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఆయన మాటల్లో, “మన దగ్గర ప్రతిభగల వ్యక్తులు చాలా తక్కువ. విదేశీ నిపుణులను తీసుకురావడం వల్లనే మన పరిశ్రమలు పోటీలో నిలబడగలవని తెలిపారు.
నిపుణుల విశ్లేషణ ప్రకారం, ట్రంప్ ఈ వ్యాఖ్యలు అమెరికాలోని టెక్ రంగానికి ముఖ్యమైన సంకేతమని భావిస్తున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి కంపెనీలు తమ ఇన్నోవేషన్, పరిశోధనలో గణనీయంగా విదేశీ నిపుణులపై ఆధారపడుతున్నాయి. హెచ్-1బీ వీసాల ద్వారా ప్రధానంగా భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ అమెరికాలో పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం అమెరికా సుమారు 85 వేల హెచ్-1బీ వీసాలు మంజూరు చేస్తుంది, అందులో ఎక్కువ శాతం భారతీయులదే.
అమెరికాలో టెక్నాలజీ రంగంలో నైపుణ్య కొరత పెరుగుతుండగా, ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు భవిష్యత్ వలస విధానాల దిశను సూచిస్తున్నాయి. శ్రామిక శక్తి లోటు, పరిశ్రమల్లో ఆటోమేషన్ పెరుగుదల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ వల్ల కొత్త నైపుణ్యాల అవసరం మరింత పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ట్రంప్ అమెరికా తలుపులు ప్రతిభావంతులకు తెరవాలనే సంకేతాన్ని ఇచ్చినట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏదేమైనా హెచ్-1బీ వీసాలపై ట్రంప్ చేసిన ఈ అరుదైన మద్దతు, అమెరికా టెక్ రంగానికి ఊరటనిచ్చింది. గతంలో కఠిన వలస విధానాలకు మద్దతు ఇచ్చిన ఆయన, ఇప్పుడు అంతర్జాతీయ ప్రతిభను స్వాగతిస్తూ మాట్లాడడం గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌పై ఉన్న ఆధారాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇది అమెరికా భవిష్యత్ ఆర్థిక వ్యూహంలో ఒక కొత్త దిశగా పరిగణించవచ్చు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)