Covids Origin: కరోనా ఎక్కడి నుంచి వచ్చిందో తెలాల్సిందే! కరోనా మూలాలపై డబ్లూహెచ్‌వో చీఫ్ సంచలన వ్యాఖ్యలు,నిజనిర్ధారణ కోసం చైనా సహకరించాంటూ డబ్లూహెచ్‌వో చీఫ్ హుకుం
వివిధ దేశాలు చైనాతో (China) జరిగే ద్వైపాక్షిక సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చకు తేవాలన్నారు. వుహాన్ ల్యాబ్‌లో పరిశోధనలకు అనుమతి ఇస్తే, డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందాన్ని పంపుతామని చైనాకు ఇప్పటికే లేఖ రాశామని తెలిపారు.
New York, SEP 17: కరోనా వైరస్ మూలాలపై నిజ నిర్దారణకు పూర్తిగా సహకరించాలని చైనాను మరోమారు కోరామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ (tedros) ఘెబ్రోయెసస్ తెలిపారు. ఈ విషయమై చైనా ఖచ్చితంగా తమకు సహకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. వుహన్ ల్యాబ్ (Whuhan Lab)నుంచే కొవిడ్-19 మహమ్మారి బయటకు వచ్చిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో నిజ నిర్ధారణ కోసం చైనాకు వైద్య నిపుణులను పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. వివిధ దేశాలు చైనాతో (China) జరిగే ద్వైపాక్షిక సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చకు తేవాలన్నారు. వుహాన్ ల్యాబ్‌లో పరిశోధనలకు అనుమతి ఇస్తే, డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందాన్ని పంపుతామని చైనాకు ఇప్పటికే లేఖ రాశామని తెలిపారు. ప్రపంచ మానవాళిని భయబ్రాంతులకు గురి చేసిన కరోనా వైరస్ (Corona virus) ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయమై స్పష్టమైన సమాచారం లేదు. 2019లో చివర్లో వుహాన్‌లో తొలి కేసు నమోదైంది.
కొవిడ్-19 వైరస్ విషయమై రెండు వేర్వేరు వాదనలు వినిపిస్తున్నాయి. వుహాన్ ల్యాబ్‌లో పరిశోధనలు జరుపుతున్నప్పుడే కొవిడ్-19 వైరస్ బయటకు వచ్చిందని కొందరు వాదిస్తుంటే.. కరోనా సోకిన జంతువు నుంచి మానవుల్లోకి వ్యాపించి ఉండొచ్చునని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై 2021లో డబ్ల్యూహెచ్ఓ (WHO) నియమించిన నిజ నిర్ధారణ కమిటీ.. చైనా వైద్య బృందంతో కలిసి ఉమ్మడి నివేదిక బయట పెట్టింది. వుహాన్ మార్కెట్‌లో ఒక గబ్బిలం నుంచి ఈ వైరస్ సోకి ఉండొచ్చునని నివేదికలో పేర్కొన్నా.. మిగతా వివరాలు వెల్లడించలేదు.
డబ్ల్యూహెచ్ఓ- చైనా వైద్య నిపుణుల ఉమ్మడి నివేదికపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో తమ నిజ నిర్ధారణ బృందాన్ని మాత్రమే వుహాన్ ల్యాబోరేటరీలోకి అనుమతించాలని పలుసార్లు డబ్ల్యూహెచ్ఓ కోరినా చైనా అంగీకరించడం లేదు. అయినా దీనిపై దర్యాప్తు జరిపించే అంశాన్ని విరమించే ప్రసక్తి లేనే లేదని డబ్ల్యూహెచ్‌వో డీజీ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రోయెసస్ స్పష్టం చేశారు. కొవిడ్ వైరస్‌కు మూలాలు ఎక్కడ ఉన్నాయన్న విషయమై ఖచ్చితమైన సమాచారం తెలుసుకుంటామని పలుసార్లు బహిరంగానే ప్రకటించారు.