WHO on Coronavirus: ముప్పు మరింతగా పెరుగుతోంది, కోవిడ్-19 వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ, నిర్లక్ష్యమే పెను ప్రమాదంగా మారిందని తెలిపిన సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌

పరిస్థితి మరింత దిగజారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌ (Tedros Adhanom Ghebreyesus) హెచ్చరించారు. . ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు70 లక్షలను మించడంతో ఆందోళన వ్యక్తం చేసిన సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది. ఐరోపాలో పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతరం అవుతోందని సంస్థ ఆందోళనతో కూడని హెచ్చరికలు చేసింది.

WHO Chief Tedros Adhanom Ghebreyesus (Photo Credits: Twitter/@WHO)

Geneva, June 8: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరుపై (coronavirus situation) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి మరింత దిగజారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌ (Tedros Adhanom Ghebreyesus) హెచ్చరించారు. . ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు70 లక్షలను మించడంతో ఆందోళన వ్యక్తం చేసిన సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది. ఐరోపాలో పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతరం అవుతోందని సంస్థ ఆందోళనతో కూడని హెచ్చరికలు చేసింది.

ఆదివారం (జూన్‌ 7న) ఒక్కరోజే ప్రపంచంలో 1,36,000 కరోనా కేసులు పెరిగినట్లు వెల్లడించారు. ఇందులో అమెరికా, దక్షిణాసియాలోని పది దేశాల్లోనే 75 శాతం కేసులు ఉన్నాయని చెప్పారు. గత తొమ్మిది రోజుల్లో లక్ష మందికి వైరస్‌ సోకినట్లు తెలిపారు. ఒక్క రోజులో ఇన్ని పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. అమెరికా, దక్షిణ ఆసియాలోని 10 దేశాలనుంచి 75శాతం కేసులు నమోదయ్యాయంటూ విలేకరుల సమావేశంలో టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు.   ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా మృతి, 70 లక్షలు దాటేసిన కోవిడ్-19 కేసులు, కేసుల వివరాలను ఇక వెల్లడించమని తెలిపిన బ్రెజిల్

గత 10 రోజులలో తొమ్మిది రోజుల కాలంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఆఫ్రికాలో చాలా దేశాలలో 1,000 కంటే తక్కువ కేసులు ఉన్నప్పటికీ, చాలా దేశాల్లో కొత్త ప్రాంతాల్లో విస్తరణ సహా కేసుల పెరుగుదల నమోదవుతోందని టెడ్రోస్ చెప్పారు. అదే సమయంలో ప్రపంచంలోని అనేక దేశాల్లో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని టెడ్రోస్ చెప్పారు. అయితే ఈ దేశాలలో అతిపెద్ద ముప్పు నిర్లక్ష్యమేనని టెడ్రోస్ పేర్కొన్నారు.

గతేడాది డిసెంబర్‌లో చైనాలో పుట్టిన ఈ ప్రాణాంతక వైరస్‌ ఇప్పటివరకు 4,03,000 మందిని పొట్టనపెట్టుకుందని, 70 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పారు. చైనా తర్వాత తూర్పు ఆసియా కరోనాకు కేంద్రంగా మారిందని, అనంతరం అది యూరప్‌ ఖండానికి విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం కరోనాకు ప్రధాన కేంద్రంగా ఉన్న అమెరికా వాటిని అధిగమించిందని తెలిపారు. అమెరికాలో జరుగుతున్న జాతివ్యతిరేక ఆందోళనలతో వైరస్‌ మరింతగా వ్యాప్తిచెందే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

కొన్ని దేశాల్లో వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉన్నదని, మరికొన్ని దేశాల్లో కేసుల సంఖ్య వెయ్యిలోపే ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయని, అయితే నిర్లక్ష్యమే వారికి ముప్పుగా మారే అవకాశం ఉందన్నారు. ఐరోపాలో పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఇది మరింత దిగజారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.