Donald Trump (photo-X/Donlad Trump)

New York, Jan 21: రెండోసారి దేశాధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మ‌రో సంచలన నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. వైట్‌హౌజ్ చేరుకున్న త‌ర్వాత ఆయ‌న ప‌లు డాక్యుమెంట్ల‌పై సంత‌కం చేశారు. దాంట్లో డ‌బ్ల్యూహెచ్‌వో ఉప‌సంహ‌ర‌ణ ఆదేశాలు కూడా ఉన్నాయి.

వీడియోలు ఇవిగో, భార్యతో కలిసి కత్తి పట్టుకుని డ్యాన్స్ వేసిన డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతల స్వీకరణ

కాగా డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి త‌ప్పుకోవాల‌ని ట్రంప్ ఆదేశాలు ఇవ్వ‌డం ఇది రెండోసారి. కోవిడ్‌19 స‌మ‌యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ స‌రైన రీతిలో వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని గ‌తంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. జెనీవాకు చెందిన ఆ సంస్థ స‌భ్య‌త్వం నుంచి వైదొలుగుతున్న‌ట్లు గ‌తంలోనూ వెల్ల‌డించారు. అయితే బైడెన్ వచ్చాక ఆ నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేశారు. ఇక డ‌బ్ల్యూహెచ్‌వోకు అమెరికా అంద‌జేస్తున్న ఆర్థిక సాయంలో కూడా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు ట్రంప్ చెప్పారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చైనాకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ట్రంప్ అధికారం చేపట్టిన తొలిసారి ఆరోపించారు.

Trump Withdraws US from WHO

డ‌బ్ల్యూహెచ్‌వోను అమెరికా వీడ‌డం వల్ల దానికి ఆర్థిక ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశాలు ఉన్నాయి.ప్ర‌స్తుతం డ‌బ్ల్యూహెచ్‌వోకు అయిదోవంతు నిధుల‌ను అమెరికానే ఇస్తోంది.ఒక‌వేళ ఆ సంస్థ నుంచి అమెరికా త‌ప్పుకుంటే అమెరికా ఆరోగ్య వ్య‌వ‌స్థ‌పై కూడా ప్ర‌భావం ప‌డుతుందని ప‌బ్లిక్ హెల్త్ నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.