WHO Warns on Covid-19: బీ అలర్ట్! రానున్న రోజుల్లో మరిన్ని కరోనా వేవ్‌లు వచ్చే అవకాశం, దాదాపు 500కు పైగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల వ్యాప్తి
చైనాలో తీవ్రస్థాయిలో కొవిడ్ కేసులు వెలుగు చూడడం ఆందోళనకరం అని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి మరియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు. `ప్రపంచ దేశాలు కొవిడ్ ఆంక్షలు సడలించాయి. ఇదే టైంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రబలంగా వ్యాపిస్తున్నది.
New Delhi, DEC 30: ప్రస్తుతం చైనాతోపాటు పలు దేశాల్లో కొవిడ్-19 (Covid -19) మహమ్మారి మరోదఫా విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేసింది. 2020 నుంచి అమల్లో ఉన్న కొవిడ్-19 ఆంక్షల్లో సడలింపుతోపాటు పలు కారణాల వల్ల వైరస్ వ్యాపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో మరిన్ని వేవ్‌లు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే 500కి పైగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు (Omicron Variant)వ్యాపిస్తున్నాయని పేర్కొంది. చైనాలో తీవ్రస్థాయిలో కొవిడ్ కేసులు వెలుగు చూడడం ఆందోళనకరం అని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి మరియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు. `ప్రపంచ దేశాలు కొవిడ్ ఆంక్షలు సడలించాయి. ఇదే టైంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రబలంగా వ్యాపిస్తున్నది.
వివిధ దేశాల్లో 500 ఒమిక్రాన్ సబ్‌వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. మున్ముందు మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఒమిక్రాన్ వేరియంట్లకు రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకునే గుణం ఉండటం ఆందోళనకరం. వీటిపై పోరాడేందుకు మనవద్ద సరిపడా అస్త్రాలు ఉండటం ఉపశమనం కలిగించే అంశం` అని మరియా వాన్ కెర్ఖోవ్ పేర్కొన్నారు.
`ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్లే కొవిడ్ ప్రభావం తగ్గింది. చైనాతోపాటు పలు దేశాల్లో వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యానికి గురయ్యే వారితోపాటు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలి. చైనాలో కొవిడ్-19 ఉధృతి పెరుగుదల తీరు ఆందోళనకరం. వ్యాక్సిన్‌తోపాటు తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి చికిత్స అందించడానికి అవసరమైన మందులు, బెడ్లు అందుబాటులో ఉంచుకోవాలి` అని సూచించారు.