Florida Horror: దారుణం.. భర్తను 140 సార్లు కత్తితో పొడిచి చంపిన భార్య, అంతటితో ఆగక అతని పుర్రెను ముక్కలు ముక్కలు చేసింది, కొడుకు ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు, అమెరికాలోని ఫ్లోరిడాలో భయానక ఘటన

దివ్యాంగుడైన భర్తను భార్య 140 సార్లు కత్తితో పొడిచి (Wife stabs disabled Husband 140 times) చంపింది. అంతే కాకుండా అతని పుర్రెను ముక్కలు ముక్కలు (fractures skull in Florida) చేసింది.

Image used for representational purpose only. | File Photo

Florida, Feb 21: అమెరికాలోని ఫ్లోరిడాలో భయానక ఘటన చోటు చేసుకుంది. దివ్యాంగుడైన భర్తను భార్య 140 సార్లు కత్తితో పొడిచి (Wife stabs disabled Husband 140 times) చంపింది. అంతే కాకుండా అతని పుర్రెను ముక్కలు ముక్కలు (fractures skull in Florida) చేసింది. పామ్ బీచ్ కౌంటీలోని పామ్ స్ప్రింగ్స్ కౌంటీకి చెందిన 61 ఏండ్ల జోన్ బుర్కే, 62 ఏండ్ల భర్త మెల్విన్ వెల్లర్‌ను మాంసం కోసే కత్తితో పలు మార్లు పొడిచి హత్య చేసింది. ఈ దారుణ ఘటనపై 41 ఏండ్ల కుమారుడు పోలీసులకు ( Palm Springs Police Department) సమాచారం ఇచ్చారు.

దీంతో పోలీసులు అక్కడకు వచ్చి కిచెన్‌లో రక్తం మడుగుల్లో మరణించిన మెల్విన్‌ను పరిశీలించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. వైద్యులు మృతదేహంపై 140 కత్తిపోట్లను గుర్తించారు. మృతుడి కపాలం బాగా చిద్రమైందని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు జోన్ బుర్కేను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్య కింద కేసు నమాదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దివ్యాంగుడైన భర్తను ఎందుకు హత్య చేసిందో అన్నది ఆమె వెల్లడించలేదు.

పుణేలో దారుణం, పడుకోవడానికి రాలేదని సెక్స్ వర్కర్‌పై బ్లేడుతో దాడి చేసిన విటుడు, మరో ఘటనలో ఢిల్లీలో 87 ఏండ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన కామాంధుడు

ఆ మహిళ మౌనంగా ఉండటంతో ఆమె మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఆసుపత్రికి తరలించారు. నిందితురాలు బర్క్‌పై ఫస్ట్-డిగ్రీ హత్య అభియోగాలు మోపారు. ఈ సంఘటన ఫిబ్రవరి 11న జరిగింది