Houston Firing: చర్చిలో ప్రార్ధనలు జరుగుతండగా ఒక్కసారిగా కాల్పులు, ఐదేళ్ల బాలుడితో వచ్చి గన్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన మహిళ
టెక్సాస్‌లోని హూస్టన్‌లో (Houston) ఉన్న మెగాచర్చిలో ఓ మహిళ కాల్పులకు పాల్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను కాల్చి చంపారు. ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడితో సహా మరో వ్యక్తి గాయపడ్డారు.
Houston, FEB 12: అగ్రరాజ్యం (Firing)లో మళ్లీ తుపాకుల మోత మోగింది. టెక్సాస్‌లోని హూస్టన్‌లో (Houston) ఉన్న మెగాచర్చిలో ఓ మహిళ కాల్పులకు పాల్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను కాల్చి చంపారు. ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడితో సహా మరో వ్యక్తి గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఐదేళ్ల బాలుడితో చర్చిలోకి ప్రవేశించిన మహిళ.. తాను ధరించిన కోటు చాటున పొడవాటి తుపాకీని తీసుకొచ్చింది.
ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించింది. దీంతో అక్కడివారు భయబ్రాంతులకు గురయ్యారు. భద్రతను పర్యవేక్షిస్తున్న ఇద్దరు పోలీసులు వెంటనే ఎదురు కాల్పులు జరపటంతో ఆమె మృతిచెందింది.
ఈ సందర్భంగా ఆమెతో వచ్చిన బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన మహిళను గుర్తించే పనిలో ఉన్నట్లు హూస్టన్ పోలీస్ చీఫ్ ట్రాయ్ ఫిన్నర్ తెలిపారు. ఆమె ఎందుకు కాల్పులు జరిపిందనే అంశంపై దర్యాప్తు చేపట్టామన్నారు.