Holes in Condoms: కండోమ్‌కు కన్నం పెట్టినందుకు 6 నెలలు జైలు శిక్ష, జర్మనీలో తొలికేసు, మహిళ ఎందుకు అ
ఇందుకోసం ఖతర్నాక్ స్కెచ్ వేసింది. తాను గర్భం దాలిస్తే అతడు తనను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని భావించింది. అంతే.. అతడితో శృంగారంలో (Sex) పాల్గొన్న సమయంలో అతడికి తెలియకుండా సీక్రెట్ గా కండోమ్ కి కన్నం పెట్టింది. కట్ చేస్తే.. ఆమె గర్భవతి అయ్యింది.
Berlin, May 07: కండోమ్ కి కన్నం (Condom Hole) పెట్టడం ఏంటి? జైలుపాలవడం ఏంటి? అంతా అయోమయంగా ఉంది కదూ. అసలేం జరిగిందంటే.. కండోమ్ కి కన్నం (Condom Hole) పెట్టినందుకు ఓ మహిళ కటకటాల పాలైంది. ఆమెకు 6 నెలల జైలు శిక్ష పడింది. ఈ వింత, విడ్డూరమైన కేసు జర్మనీలో (Germany) నమోదైంది. అంతేకాదు ఆ దేశంలో ఈ తరహాలో వెలుగుచూసిన తొలి కేసు ఇదే. జర్మనీలో ఓ మహిళకు ఆన్ లైన్ లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. అయితే, ఆ మహిళ అతడిపై మోజు పడింది. పెళ్లి చేసుకోవాలని (Marriage) డిసైడ్ అయ్యింది. ఆ వ్యక్తికి మాత్రం అలాంటి ఆలోచనలేవీ లేవు. మహిళ మాత్రం తన సొంతం చేసుకోవాలనుకుంది. ఇందుకోసం ఖతర్నాక్ స్కెచ్ వేసింది. తాను గర్భం దాలిస్తే అతడు తనను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని భావించింది. అంతే.. అతడితో శృంగారంలో (Sex) పాల్గొన్న సమయంలో అతడికి తెలియకుండా సీక్రెట్ గా కండోమ్ కి కన్నం పెట్టింది. కట్ చేస్తే.. ఆమె గర్భవతి అయ్యింది.
తాను గర్భవతిని (Pregnant)అయ్యాను కనుక ఇక తనకు ఎలాంటి భయలేదని అనుకుందో మరో కారణమో కానీ.. ఆమె అసలు నిజం అతడికి చెప్పేసింది. శృంగారం Sex() సమయంలో కండోమ్ కి తానే కన్నం పెట్టానంది.
నిజం తెలిసి అతగాడు షాక్ తిన్నాడు. కోపంతో ఊగిపోయాడు. నన్నే మోసం చేస్తావా? అంటూ చిందులేశాడు. తాను మోసపోయానని గ్రహించిన అతడు.. దీనిపై కోర్టుని ఆశ్రయించాడు. ఈ కేసుని విచారించిన కోర్టు.. ఆ మహిళకు షాక్ ఇచ్చింది. 6 నెలల జైలు శిక్ష విధించింది. కాగా, సెక్స్ లో రహస్యంగా కండోమ్ తీసేస్తే స్టెల్తింగ్ (Selthing) అంటారు. దీన్ని మోసంగా పరిగణిస్తారు. జర్మనీలో తొలిసారి వెలుగుచూసింది ఈ తరహా కేసు.