Glass Tumbler in Bladder: ప్రాణం మీదకు తెచ్చిన హస్తప్రయోగం, స్వయంతృప్తికోసం గ్లాస్ పెట్టుకున్న మహిళ, లోపలే చిక్కుకొని పోవడంతో నాలుగేళ్లుగా నరకం, ఆపరేషన్ చేసి తీసిన వైద్యులు
ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగేళ్ల పాటూ నరకయాతన అనుభవించింది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (urinary tract infection) అని వచ్చిన ఆ మహిళ రిపోర్టు చూసి షాక్ అయ్యారు వైద్యులు. ఆమె మూత్రనాళంలో 8సెంటీమీటర్ల గాజు సీసా ముక్కను గుర్తించారు. దాంతో నాలుగేళ్లుగా బాధపడుతున్నట్లుగా తెలిసింది.
Newyork, March 18: సెక్స్ కోరిక తీర్చుకునేందుకు ఓ మహిళ చేసిన పని...ఆమె ప్రాణం మీదకు తీసుకువచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగేళ్ల పాటూ నరకయాతన అనుభవించింది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (urinary tract infection) అని వచ్చిన ఆ మహిళ రిపోర్టు చూసి షాక్ అయ్యారు వైద్యులు. ఆమె మూత్రనాళంలో 8సెంటీమీటర్ల గాజు సీసా ముక్కను (8 cm-wide bladder stone) గుర్తించారు. దాంతో నాలుగేళ్లుగా బాధపడుతున్నట్లుగా తెలిసింది. 45ఏళ్ల మహిళకు యూటీఐ (UTI) లక్షణాలైన యూరిన్ లీకింగ్‌తో తరచూ టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుందని డాక్టర్లను సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళ బ్లాడర్ ను (Bladder ) స్కానింగ్ చేయగా పెద్ద రాయితో పాటు గాజు ముక్క ఉన్నట్లు తెలిసింది. ఎనిమిది సెంటీమీటర్ల పొడవున్న రాయిని, దాంతో పాటు ఉన్న గ్లాసును తొలగించారు.
మెడికల్ జర్నల్ దీనిపై వివరణ ఇస్తూ.. ఇలాంటి విషయాల్లో మెడికల్ అడ్వైజ్ తీసుకోవడానికి భయపడి లేదా సిగ్గుపడి అలా ఉండిపోతారు. ఫలితంగా ఇలాంటి వాటికి దారి తీస్తాయి. ఎట్టకేలకు మహిళకు సిస్టోలిథోటమీ అనే ఓపెన్ సర్జరీ జరిపి రాయిని, గ్లాసుని తొలగించారు. అదృష్టవశాత్తు మహిళకు రక్తస్రావం కావడం లాంటి సమస్యలు లేవని వైద్యులు అంటున్నారు. తరచూ మూడ్ మారుతుండటం వంటి లక్షణాలు తప్ప వేరే సమస్యలు లేవని బాధితురాలు వెల్లడించింది.
న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. నాలుగేళ్ల క్రితం మహిళ శృంగార కోరికలు తీర్చుకునేందుకు గానూ గాజు గ్లాసును యోని భాగానికి బదులుగా మూత్రనాళములోకి జొప్పించుకుందట. సదరు మహిళ గురించి ‘సైన్స్ డైరక్ట్’ అనే మెడికల్ జర్నల్ కూడా కథనం ప్రచురించింది.ఆ జర్నల్ లో నార్తరన్ ఆఫ్రికాలోని తునీషియా ప్రాంతానికి చెందిన మహిళ సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.