Illia Yefimchyk: ప్రపంచంలోని అత్యంత భారీ బాడీ బిల్డర్ ఇల్లియా ‘గోలెమ్’ యెఫించిక్ గుండె పోటుతో మృతి.. యెఫించిక్ మరణంపై ఆయన సతీమణి ఏమన్నారంటే?
గుండెపోటుతో ఆయన మరణించినట్టు ఆయన సతీమణి అన్నా పేర్కొన్నారు.
Newdelhi, Sep 15: ప్రపంచంలోని అత్యంత భారీ బాడీ బిల్డర్ గా గుర్తింపు పొందిన ఇల్లియా ‘గోలెమ్’ యెఫించిక్ (Illia Yefimchyk) (36) మరణించారు. గుండెపోటుతో (Heart Attack) ఆయన మరణించినట్టు ఆయన సతీమణి అన్నా పేర్కొన్నారు. యెఫించిక్ ను ‘ది మ్యుటెంట్’ అని ముద్దుగా పిలుస్తారు. 6 అడుగుల ఎత్తు, 340 పౌండ్ల బరువు గల ఆయన ప్రపంచంలో అత్యంత భయంకరమైన బాడీ బిల్డర్(బాహుబలుడి)గా పేరు సంపాదించారు. అయితే, ఆయన ఏ కుస్తీ పోటీల్లో పాల్గొనకపోవడం గమనార్హం. యెఫించిక్ కండలు 25 అంగుళాల చుట్టుకొలత కలిగి ఉండేవి. ఆయన రోజుకు 16,500 క్యాలరీల ఆహారాన్ని తీసుకునేవారని కుటుంబసభ్యులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు.. వచ్చే వారం రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు
ప్రయత్నం చేసినప్పటికీ..
యెఫించిక్ భార్య అన్నా మాట్లాడుతూ.. ఈ నెల 6న ఆయన గుండె చాలా వేగంగా కొట్టుకుందని, అంబులెన్స్ వచ్చే లోపల ఆయన ఛాతీపై ఒత్తి, ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ మరణించారని చెప్పారు.