Hyderabad, Sep 15: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వచ్చే వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందన్న అధికారులు.. అది బంగ్లాదేశ్ కి ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. ఈ వాయుగుండం వాయవ్య దిశగా కదులుతోందని.. దీని ప్రభావంతో బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో వర్షాలు కురుస్తున్నాయన్నారు. దీని కారణంగానే ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ వారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుసే ఛాన్స్ ఉందన్నారు.
నేడు రేపు ఇలా..
నేడు, రేపు తెలంగాణంలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి జిల్లాలతో పాటు ఏపీలోని తీరప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.