World's Worst Animal Abuser: ఈ వార్త చదివాక.. అసలు వీడు మనిషేనా? అంటారు.. 60కిపైగా కుక్కలను రేప్ చేసి చంపాడు మరి..! క్రూరుడైన ఆ జువాలజిస్ట్ కు 249 ఏళ్ల జైలుశిక్ష పడే చాన్స్.. అసలేంటా విషయం??
ఆస్ట్రేలియాలోని డార్విన్ లో బ్రిటన్ కు చెందిన మొసళ్ల నిపుణుడు ఆడమ్ బ్రిట్టన్ అనే జువాలజిస్ట్ నివసించేవాడు. అతడిది విచిత్రమైన మానసిక స్థితి.
Newdelhi, July 15: ఒళ్లు గగుర్పొడిచే జుగుప్సాకరమైన వార్త ఇది. ఆస్ట్రేలియాలోని డార్విన్ లో బ్రిటన్ కు చెందిన మొసళ్ల నిపుణుడు ఆడమ్ బ్రిట్టన్ (Adam Britton) అనే జువాలజిస్ట్ నివసించేవాడు. అతడిది విచిత్రమైన మానసిక స్థితి. డజన్లకొద్దీ కుక్కలపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా వాటిని హింసించి చంపడం అతనికి ఎంతో ఇష్టం (World's Worst Animal Abuser). ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 60కిపైగా కుక్కలను అతిదారుణంగా హింసించి, జుగుప్సాకరంగా వాటిపై అత్యాచారానికి పాల్పడి ఆపై హతమార్చాడు. దీంతో బ్రిట్టన్ కు ఏకంగా 249 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉన్నట్టు బ్రిటన్ వార్తాసంస్థ మిర్రర్ ఓ కథనంలో వెల్లడించింది.
న్యాయమూర్తే షాక్
గురువారం ఈ కేసు విచారణ మొదలైంది. ఆ సమయంలో ఎన్ టీ సుప్రీంకోర్టు జడ్జి మైఖేల్ గ్రాంట్ తన సిబ్బందిని, జంతుప్రేమికులను కోర్టు గదిలోంచి బయటకు వెళ్లాల్సిందిగా సూచించినట్లు మిర్రర్ వార్తాసంస్థ తెలిపింది. ‘ఈ కేసులోని ఆధారాలను చూస్తుంటే నరాల షాక్ లేదా ఇతర మనోవేదన కలిగించేలా అనిపిస్తోంది. ఇది జంతువులపట్ల జరిగిన అత్యంత హేయమైన హింస’ అని జడ్జి పేర్కొన్నట్లు ఏబీసీ వార్తాసంస్థ పేర్కొంది.
ఉత్తరప్రదేశ్ లోని మథురలో ఐదేండ్ల పిల్లాడిపై దాడి చేసిన కోతులు.. కాపాడిన యువకులు (వైరల్ వీడియో)
జైలు శిక్షను తగ్గించాలని..
కాగా, ఈ కేసులో తన క్లయింట్ పశ్చాత్తాపం చెందుతున్నాడని బ్రిట్టన్ తరఫు న్యాయవాది వాదించాడు. అందువల్ల తన క్లయింట్ కు విధించే జైలు శిక్షను తగ్గించాలని కోర్టును కోరాడు. కాగా, ఏబీసీ వార్తాసంస్థ కథనం ప్రకారం.. ‘బ్రిట్టన్ కుక్కలను హింసించి చంపేవాడు. ఆ తతంగాన్ని రికార్డు చేసేవాడు. కుక్కలను హింసించేందుకు ఒక షిప్పింగ్ కంటెయినర్ ను టార్చర్ గదిగా మార్చుకున్నాడు. అందులోనే కుక్కలను లైంగికంగా హింసించేవాడ’ని ఆ వార్తా సంస్థ వెల్లడించింది. కాగా బ్రిట్టన్ కు పడే శిక్ష త్వరలో ఖరారు కానున్నది.