SLBC Tunnel Collapse Update (Photo-X/Video Grab)

Hyd, Feb 25: నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌ పైకప్పు కూలిన ప్రమాద స్థలం చాలా దూరంలో ఉండటంతో శకలాలు, మట్టి దిబ్బలు, బురద తొలగింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కావడంలేదు. సొరంగంలో ఇంకా 2.5 మీటర్ల మేర బురద అలాగే ఉండటంతో అక్కడి నుంచి ఘటనా స్థలం వద్దకు నడవడం చాలా కష్టంగా మారింది. నాగర్ కర్నూల్ లోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం స్నిఫర్ డాగ్‌లను సాయం కోసం పిలిచారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం NDRF మరియు SDRF బృందాలతో పాటు SLBC Tunnelలోకి Sniffer Dogs ప్రవేశించాయి.

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం, బిగ్గరగా అరిచినా 8 మంది నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని తెలిపిన మంత్రి జూపల్లి కృష్ణారావు

ప్రస్తుతం ఘటన స్థలి వద్ద నలుగురు మంత్రుల పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రెస్క్యూ టీమ్ లు 13.7 కి.మీ వరకు చేరుకున్నాయి. టన్నెల్ 10.95 కి.మీ వద్ద ఒకటిన్నర అడుగు నీరు నిలిచి ఉన్నట్టు గుర్తించారు. 11.9 కి.మీ వద్ద రెండు అడుగుల మేర నీటి ప్రవాహం ఉన్నట్టు గుర్తించారు. 13వ కి.మీ వద్ద టన్నెల్ బోరింగ్ మెషీన్ వెనుక పరికరాలు దెబ్బతిన్నాయి. బోరింగ్ మెషీన్ వెనుకభాగంలో బురద పేరుకుపోవడంతో కన్వేయర్ బెల్ట్ పనిచేయడంలేదు.

Sniffer dogs were pressed into service by the Telangana govt to identify the 8 workers 

14వ కిలోమీటరు మరో 100 మీటర్ల దూరంలో ఉందనగా.... 6 అడుగుల ఎత్తులో మట్టి, రాళ్లతో పూడిక ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. టన్నెల్ లో చిక్కుకుపోయిన 8 మంది 14వ కిలోమీటరు వద్దే ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎండోస్కోపిక్ రోబోటిక్ పుష్ కెమెరాలు తీసుకెళ్లినా, పూడిక కారణంగా ప్రయోజనం కనిపించలేదు. బోరింగ్ మెషిన్ దెబ్బతినడంతో పుష్ కెమెరా టీమ్ లు ముందుకెళ్లలేక ఆగిపోయాయి.