
Hyd, Feb 24: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం కూలిన ఘటనలో 8 మంది ఆచూకీ ఇంతవరకు లభించలేదు. అయితే సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వారిని ఎలాగైనా ప్రాణాలతో బయటికి రప్పించేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ ను సైతం రప్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తాను చివర వరకు వెళ్లానని అన్నారు. తాను వెళ్లిన ప్రదేశం ప్రమాద స్థలానికి 50 మీటర్ల దూరం వరకు ఉంటుదని చెప్పారు.
అయితే ఫొటోలు తీసినప్పుడు సొరంగంచివరి కనిపించిందని అన్నారు. సొరంగం (Telangana Tunnel Collapse Update) వ్యాసం ఉన్న 30 అడుగులు ఉంటుందని, అందులో 25 మీటర్ల మేర బురద పేరుకు పోయిందని అన్నారు. తాము వారి పేర్లను పిలిచినా వారు పలుకడం లేదని అన్నారు. బిగ్గరగా అరిచినా ఎలాంటి స్పందన రావడం లేదని చెప్పారు. పరిస్థితిని చూస్తే వాళ్లు బతికే అవకాశాలు చాలా తక్కువని ఆయన (Jupally Krishna Rao)చెప్పారు.
శనివారం ఉదయం కూలిపోయిన టన్నెల్ లో (SLBC Tunnel Collapse Update) ఎనిమిది మంది చిక్కుకున్నారు. వారితో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని వందల టన్నుల బరువున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ దాదాపు 200 మీటర్ల దూరం కొట్టుకుపోయిందని, నీరు ఉప్పొంగడం వల్ల ఇది జరిగిందని అధికారులు చెబుతున్నారు.
SLBC Tunnel Collapse Update
SLBC టన్నెల్ ప్రమాద ఘటన అప్డేట్స్..
సొరంగంలో 13.8 కి.మీ ప్రయాణించి సంఘటన స్థలానికి చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
6.8 కి.మీ లోకో ట్రైన్ లో ప్రయాణించి అక్కడి నుంచి కన్వేయర్ బెల్ట్ పై 7 కి.మీ కాలినడక వెళ్లిన మంత్రి జూపల్లి
రెస్క్యూ టీంకు అండగా నిలబడి భరోసా కల్పించిన మంత్రి… pic.twitter.com/JJdcv7SKte
— BIG TV Breaking News (@bigtvtelugu) February 24, 2025
వాళ్లను తీసుకు రావడానికి కనీసం మూడు నాలుగు రోజులు పడుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్న పర్యవేక్షక అధికారి ఒకరు తెలిపారు.