
Meerut, NOV 09: కుక్క పిల్లల శబ్దానికి తమ నిద్రకు భంగం కలుగుతున్నదని ఇద్దరు మహిళలు ఆగ్రహించారు. ఆ కుక్క పిల్లల పట్ల దారుణంగా ప్రవర్తించారు. వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. (puppies burnt alive) యానిమల్ కేర్ సొసైటీ ఫిర్యాదుతో ఇద్దరు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. కంకేర్‌ఖేడా ప్రాంతానికి చెందిన ఒక వీధి కుక్క ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆ కుక్క పిల్లల శబ్దాలకు తమ నిద్రకు భంగం కలుగుతున్నదని అదే ప్రాంతంలోని ఒక కుటుంబానికి చెందిన శోభ, ఆర్తి ఆరోపించారు. ఐదు కుక్క పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు(Burn Five Puppies Alive). అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులతో వాగ్వాదానికి దిగారు. కాగా, ఐదు కుక్క పిల్లలు సజీవ దహనమయ్యాయి.
కాలి మరణించిన వాటిని స్థానికులు పూడ్చి పెట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో యానిమల్ కేర్ సొసైటీ జనరల్ సెక్రటరీ అన్షుమాలి వశిష్ఠ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఫిర్యాదుతో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. కుక్క పిల్లల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. వాటిని సజీవ దహనం చేసిన శోభ, ఆర్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.