Yoshihide Suga: జపాన్‌కు కొత్త సారథి, ప్రధానిగా ఎన్నికైన యోషిహిడె సుగా, ఎనిమిదేళ్ల తరువాత జపాన్‌కు కొత్త ప్రధానమంత్రిగా సుగా ఎంపిక, షింజో అబే రాజీనామాను ఆమోదించిన పార్లమెంట్
దీంతో పాటు జపాన్ అధికార పార్టీకి నూతన సారథిగా యోషిహిడే సుగా ఎంపికయ్యారు. అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అంతర్గత ఎన్నికల్లో 377 ఓట్లు సాధించిన సుగాను (Yoshihide Suga) కాబోయే జపాన్ ప్రధానమంత్రిగా ప్రకటించారు. అనారోగ్య కారణాలతో ఇటీవలే రాజీనామా చేసిన షింజో అబే స్థానంలో ఈయన ఎంపికయ్యారు.
Tokyo, September 16: జపాన్ నూతన ప్రధానమంత్రిగా యోషిహిడె సుగా (Japan New PM Yoshihide Suga) అధికారికంగా నియమితులు అయ్యారు. దీంతో పాటు జపాన్ అధికార పార్టీకి నూతన సారథిగా యోషిహిడే సుగా ఎంపికయ్యారు. అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అంతర్గత ఎన్నికల్లో 377 ఓట్లు సాధించిన సుగాను (Yoshihide Suga) కాబోయే జపాన్ ప్రధానమంత్రిగా ప్రకటించారు. అనారోగ్య కారణాలతో ఇటీవలే రాజీనామా చేసిన షింజో అబే స్థానంలో ఈయన ఎంపికయ్యారు.
సుగా ప్రస్తుతం చీఫ్ కేబినెట్ సెక్రటరీగా అబేకి కుడిభుజంగా ఉన్నారు. ఈయన పార్లమెంటుకి ఎంపిక కావడం లాంఛనమే. కరోనా కట్టడి, పతనమైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడం తన తక్షణ ప్రాధమ్యాలని సుగా పేర్కొన్నారు. తాను సంస్కరణ వాదినన్నారు. మాజీ ప్రధాని అబే ప్రాధమ్యాలను ఈయనా కొనసాగిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.
షింజో అబే (Shinzo Abe) రాజీనామాను జపాన్ పార్లమెంట్ ఆమోదించింది. జపాన్ దిగువసభ నేషనల్ డైట్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికలో యోషిహిడె ఘన విజయాన్ని సాధించారు. 71 సంవత్సరాల యోషిహిడో.. ఇదివరకు చీఫ్ కేబినెట్ సెక్రెటరీగా పని చేశారు.కొత్త ప్రధాని 2021 సెప్టెంబరు దాకా పదవిలో కొనసాగుతారు.
నేషనల్ డైట్‌లో నిర్వహించిన ఎన్నికల్లో ఆయనకు అనుకూలంగా 314 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 462 మంది సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ పద్ధతిన ఈ ఓటింగ్‌ను చేపట్టారు. నేషనల్ డైట్‌లో అధికారి లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ)కి మెజారిటీ సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికలో యోషిహిడె విజయం సాధించినట్లు స్పీకర్్ తడమొరి ఒషిమా ప్రకటించారు. కొత్త ప్రధానిగా ఆయన నియమితులయ్యారని వెల్లడించారు. ఎనిమిదేళ్ల తరువాత జపాన్‌కు కొత్త ప్రధానమంత్రి (Country's First New Leader in 8 Years) ఎన్నికయ్యారు.