Measles Outbreak: మళ్లీ ఇంకొకటి పుట్టింది, జింబాబ్వేని వణికిస్తున్న మీజిల్స్ అంటువ్యాధి, ఒక్కరోజే 37మంది చిన్నారులు మృతి, ఇప్పటివరకు 700 మంది చిన్నారులు ఈ వ్యాధితో మృతి

ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల 700 మంది చిన్నారులు (killed 700 children) మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Measles (Photo-Twitter)

HARARE, Sep 6: జింబాబ్వేలో కొత్తగా పుట్టుకొచ్చిన మీజిల్స్ వ్యాధి (measles outbreak) కలవరపాటుకు గురి చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల 700 మంది చిన్నారులు (killed 700 children) మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 1న ఒక్క రోజే 37మంది చిన్నారులు చనిపోయినట్లు తెలిపింది. సెప్టెంబర్ 4 నాటికి దేశంలో మొత్తం 6,291 కేసులు నమోదైనట్లు వెల్లడించింది.

అయితే రెండు వారాల క్రితం మీజిల్స్ (Measles outbreak in Zimbabwe) వల్ల 157మంది చిన్నారులు మరణించినట్లు అధికారులు చెప్పారు. కానీ ఇ‍ప్పుడు ఆ సంఖ్య ఏకంగా నాలుగు రెట్లు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.

15 మిలియన్ల జనాభాలో అధిక సంఖ్యలో ఆధునిక వైద్య వ్యతిరేక మతపరమైన విభాగాలు అధికారంలో ఉన్న దేశంలో టీకాలు వేయడం తప్పనిసరి చేయడానికి చట్టాన్ని రూపొందించాలని కొందరు పిలుపునిచ్చారు.

ఏప్రిల్‌లో వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి 698 మంది పిల్లలు మీజిల్స్‌తో మరణించారని దక్షిణాఫ్రికా దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారాంతంలో ప్రకటించింది. తాజా గణాంకాలు రెండు వారాల క్రితం ప్రకటించిన మరణాల సంఖ్య కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని మంత్రిత్వ శాఖ తెలిపింది, వీరిలో ఎక్కువ మంది వారి కుటుంబ మత విశ్వాసాల కారణంగా టీకాలు వేయలేదు దీంతో వారు వ్యాధికి గురయ్యారు.

చైనాపై ప్రకృతి ప్రకోపం, పెను విధ్వంసం సృష్టించిన భారీ భూకంపం, 65 మంది మృతి, భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదు

జింబాబ్వే అసోసియేషన్ యొక్క మెడికల్ అండ్ డెంటల్ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ప్రెసిడెంట్ డాక్టర్ జోహన్నెస్ మారిసా సోమవారం అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ ప్రభుత్వం కొనసాగుతున్న సామూహిక టీకా ప్రచారాన్ని పెంచాలని, ముఖ్యంగా టీకా వ్యతిరేక మత సమూహాలను లక్ష్యంగా చేసుకుని అవగాహన కార్యక్రమాలను ప్రారంభించాలని అన్నారు. మీజిల్స్ వంటి కిల్లర్ వ్యాధులకు టీకాలు వేయడం తప్పనిసరి చేసే చట్టాన్ని రూపొందించడాన్ని పరిశీలించాలని" ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

మీజిల్స్ వ్యాధి బాధితుల్లో ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకోని, పోషకాహార లోపం ఉన్న చిన్నారులే ఉంటున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో మీజిల్స్ కూడా ఒకటి. గాలి ద్వారా, తమ్ముడం, దగ్గడం వల్ల ఇతరులకు సులభంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పిల్లలలో దగ్గు, జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కన్పిస్తాయి. వ్యాక్సిన్ తీసుకోని చిన్నారులకు ఈ వ్యాధి సోకితే తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

మీజిల్స్ వ్యాప్తిని నియంత్రించాలంటే 90శాతం మంది చిన్నారులకు వ్యాక్సిన్లు అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన ఇబ్బందుల వల్ల సేవలు నిలిచిపోయి పేద దేశాల్లో మీజిల్స్ విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్‌లోనే హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5కోట్ల మంది పిల్లలు సాధారణ వ్యాక్సిన్లు తీసుకోలేకపోయారని యూనిసెఫ్‌ జులైలో చెప్పింది. దీనివల్ల పిల్లలకు ప్రమాదమని అప్పుడే హెచ్చరించింది.