Chinam, Sep 6: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లుడింగ్ కౌంటీలో సోమవారం సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. ఈ భూకంపంతో 65 మంది మృతి చెందగా మరో 50 మంది గాయపడ్డారు.భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. నీరు, విద్యుత్ సరఫరా, రవాణ, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కరువు పరిస్థితులు, కోవిడ్ ఆంక్షలతో ఈ ప్రావిన్స్ జనం ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. చైనాలో భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.చాలాచోట్ల భవనాలు భవనాలు కూలిపోగా.. పలుచోట్ల చిక్కుకున్న 50వేలమందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిచువాన్‌లో 6500 రెస్క్యూ టీమ్‌లను, నాలుగు హెలికాప్టర్లను మోహరించారు.
దీంతో పాటు 1,100 అగ్నిమాపక దళ బృందాలను రంగంలోకి దింపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ 50 మిలియన్ యువాన్లను రెస్క్యూ, రిలీఫ్ ఫండ్‌ను విడుదల చేసింది. ప్రాంతీయ ప్రభుత్వం కూడా గంజికి 50 మిలియన్ యువాన్లను కేటాయించింది.2008లో చైనాలో 8.2 తీవ్రతతో భూకంపం సంభవించగా.. 69వేలమందికిపైగా మృత్యువాతపడ్డారు. 18వేల మందికిపైగా మరణించారు.