World's First CNG Bike: ఆటో మొబైల్ రంగంలో మ‌రో సంచ‌ల‌నం, ప్ర‌పంచంలోనే తొలి సీఎన్ జీ బైక్ త‌యారు చేసిన బ‌జాజ్, జూన్ లో మార్కెట్లోకి విడుద‌ల చేయ‌నున్న కంపెనీ

సీఎన్జీ వేరియంట్ మోటారు సైకిల్(First CNG Bike) ప్రయోగాత్మకంగా పరీక్షించినప్పుడు 50 శాతం, కార్బన్ డయాక్స్ (సీఓ2) ఉద్గారాలు, కార్బన్ మోనాక్సైడ్ (సీఓ) ఉద్గారాలు 76 శాతం, మీథేన్ హైడ్రో కార్బన్ ఉద్గారాలు 90 శాతం తగ్గుతాయని తేలిందని రాజీవ్ బజాజ్ చెప్పారు.

Representational (Credits: Google)

Mumbai, March 08: బజాజ్ చేతక్ స్కూటర్లు అంటే ఎంతో ఫేమస్.. సరికొత్త టెక్నాలజీతో మోటారు సైకిళ్లు వచ్చిన తర్వాత చేతక్ స్కూటర్లు కనుమరుగైనా ఇతర ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలతో పోటీ పడుతూ మోటారు సైకిళ్లు తయారు చేస్తోంది బజాజ్ ఆటో. తాజా ఫ్యూయల్ పొదుపు కోసం ప్రపంచంలోనే తొలి సీఎన్జీ వేరియంట్ మోటారు సైకిల్‌ను (First CNG Bike) పరిచయం చేయనున్నది. ఈ సంగతి బజాజ్ ఆటో (Bajaj) కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2024-25 ఏప్రిల్-జూన్)లో బజాజ్ సీఎన్జీ మోటారు సైకిల్ మార్కెట్లోకి రానున్నది.

 

సీఎన్జీ వేరియంట్ మోటారు సైకిల్(First CNG Bike) ప్రయోగాత్మకంగా పరీక్షించినప్పుడు 50 శాతం, కార్బన్ డయాక్స్ (సీఓ2) ఉద్గారాలు, కార్బన్ మోనాక్సైడ్ (సీఓ) ఉద్గారాలు 76 శాతం, మీథేన్ హైడ్రో కార్బన్ ఉద్గారాలు 90 శాతం తగ్గుతాయని తేలిందని రాజీవ్ బజాజ్ చెప్పారు. 40 ఏండ్ల క్రితం వచ్చిన రిహో హోండా 50-65 శాతం ఫ్యుయల్ కాస్ట్ తగ్గించిందన్నారు. అంతేకాదు, వచ్చే ఏడాది ప్రారంభంలో అతిపెద్ద పల్సర్ బైక్ ఆవిష్కరించడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాజీవ్ బజాజ్ చెప్పారు. ప్రీమియం పల్సర్ ప్రీమియం వంటి బ్రాండ్లకు బదులు సూపర్ సెగ్మెంట్ మోటారు సైకిళ్లపై ఫోకస్ చేస్తున్నామని తెలిపారు. అలాగే 125సీసీ ప్లస్ సెగ్మెంట్‌పై ఫోకస్ కొనసాగుతుందన్నారు. ఇదిలా ఉంటే, సీఎన్జీ మోటారు సైకిల్ మీద జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ మాదిరిగా పరిగణిస్తే సీఎన్జీ వాహనాలపై ఐదు శాతం జీఎస్టీ కూడా విధించవద్దని, పెట్రోల్ మోటారు సైకిళ్లతో పోలిస్తే జీఎస్టీ తగ్గించాలని కోరారు. దీనివల్ల కంపెనీలకు, కస్టమర్లకు చేయూతనిచ్చినట్లు అవుతుందన్నారు.