Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా ఎల‌క్ట్రిక్ వెహికిల్ మార్కెట్లోకి వ‌చ్చే తేదీ ఖరారు, మిడ్ రేంజ్ ఎస్ యూవీల్లో గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న కారు

ఈ నేపథ్యంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో-2025లో జనవరి 17న తన పాపులర్ ఎస్‌యూవీ కారు హ్యుండాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV) కారు ఆవిష్కరించనున్నది.

Hyundai Creta EV

Mumbai, DEC 19: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) భారత్ మార్కెట్లో అత్యంత పాపులర్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ కార్లు విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో-2025లో జనవరి 17న తన పాపులర్ ఎస్‌యూవీ కారు హ్యుండాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV) కారు ఆవిష్కరించనున్నది. మహీంద్రా బీఈ 6. (Mahindra BE6., టాటా కర్వ్.ఈవీ (Tata Curv.EV), ఎంజీ జడ్ఎస్ ఈవీ (MG ZS EV) వంటి కార్లకు హ్యుండాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV) గట్టి పోటీ ఇవ్వనున్నది. త్వరలో ఆవిష్కరించే మారుతి సుజుకి ఈ-విటారా (Maruti Suzuki e-Vitara), టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ (Toyota Urban Cruiser EV) కార్లతో పోటీ పడుతుందీ హ్యుండాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV). హ్యుండాయ్ నుంచి వస్తున్న మూడో ఈవీ కారు ఇది. ఇంతకుముందు కొనా ఎలక్ట్రిక్ (Kona Electric), ఐయానిక్ 5 (Ioniq 5) తర్వాత వస్తున్న కారు క్రెటా ఈవీ.

Skoda Auto India: స్కోడా కార్ల అభిమానులకు షాక్, వాహన ధరలను 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించిన దిగ్గజం, జనవరి 1 నుంచి అమలులోకి 

తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ఫ్యాక్టరీలో క్రెటా ఈవీ కార్ల తయారీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) హ్యుండాయ్ క్రెటా మాదిరిగానే హ్యుండాయ్ క్రెటా ఈవీ కారులో క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్లె, రీ డిజైన్డ్ ఫ్రంట్ అండ్ రేర్ బంపర్స్, ఎయిరోడైనమికల్లీ డిజైన్డ్ అల్లాయ్ వీల్స్ ఉండవచ్చు. ఇంకా ట్విన్ 10.25 అంగుళాల డిస్‌ప్లేస్ ఫర్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అండ్ డ్రైవర్ కన్సోల్, 360 – డిగ్రీ కెమెరా అండ్ వెంటిలేటెడ్ సీట్స్‌తోపాటు 2 అడాస్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. 50కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటదని సమాచారం. సింగిల్ చార్జింగ్ సాయంతో 450-500 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. ఈ కారుకు ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ వెసులుబాటు కూడా ఉంటుంది. దీని ధర రూ.18 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం కానున్నదని అంచనా.



సంబంధిత వార్తలు

India Women Beat West Indies Women: టీమిండియా జైత్ర‌యాత్ర‌, వెస్టిండిస్ పై ఘ‌న విజ‌యం, 2-1 తేడాతో సిరీస్ కైవ‌సం చేసుకున్న మ‌హిళా జ‌ట్టు

Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా ఎల‌క్ట్రిక్ వెహికిల్ మార్కెట్లోకి వ‌చ్చే తేదీ ఖరారు, మిడ్ రేంజ్ ఎస్ యూవీల్లో గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న కారు

Mumbai Boat Accident Update: ముంబై బోటు ప్రమాదం, గల్లంతైన వారి కోసం ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ఆసుపత్రిలో చేరిన 105 మందిలో 90 మంది డిశ్చార్జ్, ఇద్దరి పరిస్థితి విషమం

Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif