Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ వచ్చేసింది, ధర రూ.12.99 లక్షల నుంచి ప్రారంభం, అక్టోబర్ 3 నుంచి బుకింగ్‌లు స్టార్ట్
సెప్టెంబర్ 14 నుంచి టెస్ట్ డ్రైవ్‌లు అందుబాటులోకి రానున్నాయి. అయితే బుకింగ్‌లు మాత్రం అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మహీంద్రా థార్ రాక్స్ ఎట్టకేలకు మార్కెట్లో లాంచ్ అయింది.మహీంద్రా థార్ రాక్స్ ధరలు (ఎక్స్-షోరూమ్) రూ.12.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 14 నుంచి టెస్ట్ డ్రైవ్‌లు అందుబాటులోకి రానున్నాయి. అయితే బుకింగ్‌లు మాత్రం అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీల విషయానికొస్తే దసరా నాటికి వినియోగదారులకు వాహనాలను అందజేయడం ప్రారంభిస్తుంది. మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny), ఫోర్స్ గుర్ఖా (Force Gurkha)లతోపాటు హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్ (Kia Seltos) కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది.
థార్ రాక్స్ మొత్తం ఏడు రంగుల్లో లభిస్తుంది. స్టెల్త్ బ్లాక్, టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, డీప్ ఫారెస్ట్, నెబ్యులా, బాటిల్‌షిప్ గ్రే, బర్న్ట్ సియెన్నా కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ పెయింట్ స్కీమ్‌లన్నీ బ్లాక్-పెయింటెడ్ రూఫ్‌తో జత చేయబడి ఉంటాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా బీఎస్‌ఏ గోల్డ్‌స్టార్ 650, ధర రూ.2.99 లక్షల నుంచి రూ.3.35 లక్షల వరకు..
మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx) కారు ఫ్రంట్ ఇండిపెండెంట్ డబుల్ విష్ బోన్ సస్పెన్షన్, రేర్ పెంటా లైక్ సస్పెన్షన్, అడ్వాన్స్డ్ డాంపర్ టెక్నాలజీస్ (ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డాంపింగ్, హైడ్రాలిక్ రీబౌండ్ స్టాపర్, మల్టీ ట్యూన్ వాల్వ్ విత్ కాన్‌సెంట్రిక్ లాండ్), ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, ఫ్రంట్ అండ్ రేర్‌లో విభిన్నంగా ఎలక్ట్రిక్ బ్రేక్ లాకింగ్, 644 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx) కారు వీల్ బేస్ 2850 ఎంఎం పొడవు ఉంటుంది.
జీ20 టీజీడీఐ ఎం-స్టాల్లియన్ పెట్రోల్ (177 పీఎస్ విద్యుత్, 380 ఎన్ఎం టార్క్), డీ22 ఎం హాక్ డీజిల్ (175 పీఎస్ విద్యుత్, 370 ఎన్ఎం టార్క్) వర్షన్లతో అందుబాటులో ఉంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ ఏసిన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆర్‌డబ్ల్యూడీ, ఏడబ్ల్యూడీ ఇటరేషన్లతో అందుబాటులో ఉంటది. జిప్ (Zip), జూమ్ (Zoom) డ్రైవ్ మోడ్స్, మూడు టెర్రైన్ మోడ్స్ – శాండ్ (Sand), మడ్ (Mud), స్నో (Snow) వేరియంట్లలో లభిస్తుంది. స్మార్ట్ క్రాల్ (4×4), ఇంటెలిటర్న్ (4×4) ఫీచర్లు ఉంటాయి. ఎంట్రీ లెవల్ మహీంద్రా థార్ రాక్స్ కారు పెట్రోల్ ఇంజిన్ 162 పీఎస్ విద్యుత్-330 ఎన్ఎం టార్క్, డీజిల్ ఇంజిన్ 152 పీఎస్ విద్యుత్-330 ఎన్ఎం టార్క్ వెలువరిస్తాయి.
6-ఎయిర్ బ్యాగ్స్, 3-పాయింట్ సీట్ బెల్ట్ ఫర్ ఆల్ సీట్స్ తోపాటు 35కి పైగా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ (హెడ్ ల్యాంప్స్, డీఆర్ఎల్స్, ఫాగ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్)తోపాటు నూతనంగా డిజైన్ చేసిన 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ జత చేశారు. 10.25 (టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్), ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సిక్స్ వే పవర్డ్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ విత్ నైన్ స్పీకర్స్, వైర్ లెస్ చార్జర్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ సిస్టమ్, పనోరమిక్ సన్ రూఫ్, ఆడ్రెనోక్స్ టెక్నాలజీతో 80కిపైగా కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
వేరియంట్లు, ధరలు
థార్ రోక్స్ MX1, MX3, MX5, AX3, AX5, AX7 వంటి అనేక రకాల ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. కానీ మహీంద్రా కేవలం ఎంపిక చేసిన కొన్ని పెట్రోల్, డీజిల్ వేరియంట్‌ల ధరలను మాత్రమే ప్రకటించింది.
పెట్రోల్ వేరియంట్లు
» మహీంద్రా థార్ రాక్స్ MX1 MT RWD: రూ. 12.99 లక్షలు
» మహీంద్రా థార్ రాక్స్ MX3 AT RWD: రూ. 14.99 లక్షలు
డీజిల్ వేరియంట్లు
» మహీంద్రా థార్ రాక్స్ MX1 MT RWD: రూ. 13.99 లక్షలు
» మహీంద్రా థార్ రాక్స్ MX3 MT RWD: రూ. 15.99 లక్షలు
» మహీంద్రా థార్ రాక్స్ AX3L MT RWD: రూ. 16.99 లక్షలు
» మహీంద్రా థార్ రాక్స్ MX5 MT RWD: రూ. 16.99 లక్షలు
» మహీంద్రా థార్ రాక్స్ AX5L AT RWD: రూ. 18.99 లక్షలు
» మహీంద్రా థార్ రాక్స్ AX7L MT RWD: రూ. 18.99 లక్షలు