BSA Gold Star 650 launched at price of Rs 2.99 lakh

బీఎస్‌ఏ (BSA) భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మహీంద్రా అండ్ మహీంద్రా భాగస్వామ్యంతో ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends) భారత్ మార్కెట్లోకి బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ గురువారం ఆవిష్కరించింది.తద్వారా దేశీయ ప్రీమియం మోటార్‌ సైకిల్‌ సెగ్మెంట్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోని అతి పురాతనమైన మోటార్‌ సైకిల్‌ బ్రాండ్లలో బీఎస్‌ఏ ఒకటి. దీని అసలు పేరు బర్మింగ్‌ హామ్‌ స్మాల్‌ ఆర్మ్స్‌ కంపెనీ (BSA).

బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ ధర కలర్స్ వేరియంట్‌కు అనుగుణంగా రూ.2.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమై రూ.3.35 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. ఆరు కలర్ ఆప్షన్లలో బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ లభిస్తుంది. హైలాండ్ గ్రీన్, ఇన్‌సిగ్నియా రెడ్, మిడ్‌నైట్ బ్లాక్, డాన్ సిల్వర్, షాడో బ్లాక్, షీన్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇప్పటికే బైక్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.

మహీంద్రా గ్రూపునకు చెందిన ప్రీమియం మోటార్‌ సైకిల్‌ విభాగం క్లాసిక్‌ లెజెండ్స్‌ (classic legends) 2016లో బీఎస్‌ఏను కొనుగోలు చేసింది. క్లాసిక్‌ లెజెండ్స్‌ ప్రస్తుతం దేశీయంగా జావా, యెజ్డీ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. తొలిసారి 2021లో గోల్డ్‌ స్టార్‌ 650ని యూకేలో లాంచ్ చేశారు. ప్రస్తుతం యూరప్‌, తుర్కియే, న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాల్లో విక్రయిస్తున్నారు. తాజాగా భారతదేశంలోకి తీసుకొచ్చారు.

ఓలా నుంచి తొలి ఈ మోటార్‌ సైకిల్, రోడ్‌స్టర్‌ ధర, ఫీచర్లు ఇతర వివరాలు ఇవిగో..

రెట్రో లుక్‌తో వస్తున్న ఈ మోటార్‌ సైకిల్‌కు రౌండ్‌ హెడ్‌లైట్‌ అమర్చారు. ఇందులో 652 సీసీ ఇంజిన్‌ ఉంది. ఇది 45 బీహెచ్‌పీ పవర్‌ను, 55 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఉంది. ఈ బైక్‌ గంటకు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. ట్విన్‌ పాడ్‌ సెమీ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ అమర్చారు. యూఎస్‌బీ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఇంటర్‌సెప్టర్‌ 650తో నేరుగా పోటీ పడనుంది.

5-స్పీడ్ గేర్ బాక్సు తోపాటు ఫ్రంట్ లో 320 ఎంఎం డిస్క్ బ్రేక్, రేర్ లో 255 ఎంఎం డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఫ్రంట్‌లో 41ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్, బ్యాక్ 5-స్పీడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి.లీటర్ పెట్రోల్‌తో 30 కి.మీ మైలేజీ అందిస్తుంది. 12 లీటర్ల కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటది. 18 అంగుళాల ఫ్రంట్ టైర్స్ విత్ వైర్ స్పోక్డ్ వీల్స్, 17- అంగుళాల వీల్స్ ఎట్ రేర్, 12వాట్ల సాకెట్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ కూడా ఆఫర్ చేస్తోంది