Ola Jobs Cut: ఓలా ఉద్యోగులకు షాక్.. 10 శాతం జాబ్స్ కట్! పలు రంగాల్లో బలోపేతం కావడమే లక్ష్యమన్న సంస్థ

తమ వర్క్ ఫోర్స్‌ లోని పది శాతం మంది ఇంజినీరింగ్ ఉద్యోగులు అంటే దాదాపు 200 మందిని బయటకు పంపేందుకు ప్రణాళిక రచించినట్టు పేర్కొంది. ప్రస్తుతం ఆ సంస్థలో 2000 వేలమంది ఇంజినీర్లు పనిచేస్తున్నారు.

File Image

NewDelhi, September 20: దేశంలోని అతిపెద్ద మొబిలిటీ ప్లాట్‌ఫామ్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా (Ola) తమ ఉద్యోగులకు (Employees) షాకిచ్చే ప్రకటన చేసింది. తమ వర్క్ ఫోర్స్‌ లోని పది శాతం మంది ఇంజినీరింగ్ ఉద్యోగులు (Engineering Jobs) అంటే దాదాపు 200 మందిని బయటకు పంపేందుకు ప్రణాళిక రచించినట్టు పేర్కొంది. ప్రస్తుతం ఆ సంస్థలో 2000 వేలమంది ఇంజినీర్లు పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల మార్కెట్ ఒడిదొడుకులు, 1400 కుపైగా స్కూటర్లను వెనక్కి రప్పించడం వంటివి ఆ సంస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీనికితోడు ఎస్1 ప్రొ స్కూటర్ల అమ్మకాలు గణనీయంగా పడిపోవడం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణంగా తెలుస్తోంది.

వామ్మో! గాల్లో ప్రయాణించే కారు రెడీ చేసిన చైనా, గంటకు 230 కి.మీ వేగంతో దూసుకెళ్లే కారు టెస్ట్ డ్రైవ్, త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు చైనా ప్రయత్నాలు

200 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్టు వార్తలు వస్తుండగా ఓలా మాత్రం అందుకు విరుద్ధ ప్రకటన చేసింది. వచ్చే 18 నెలల్లో తమ ఇంజినీరింగ్ వర్క్‌ఫోర్స్‌ ను 2 వేల నుంచి 5 వేలకు పెంచే యోచనలో ఉన్నట్టు పేర్కొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.