RDE Cars: ఏప్రిల్ 1 నుంచి ఈ కార్ల అమ్మకాలు బంద్.. కారణం ఏంటి? ఇంతకీ.. ఏయే కార్లు బంద్ కానున్నాయి??
దీనికి కారణం వాయు కాలుష్యానికి దారితీసే కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలే.
Hyderabad, Feb 10: రియల్ టైమ్ ఎమిషన్స్ (RTE) డేటా (Data) చూపించే సాంకేతికత లేని కార్లు (Cars) ఏప్రిల్ 1 తర్వాత రోడ్ల మీద కనిపించకపోవచ్చు. దీనికి కారణం వాయు కాలుష్యానికి (Air Pollution) దారితీసే కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలే. విషయం ఏమిటంటే.. బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన వాహనాలనే విక్రయించాలని కేంద్రం కొత్త విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు బీఎస్-4 వాహనాల విక్రయాలు నిలిపివేస్తూ 2020లో కేంద్రం ఆదేశాలు ఇచ్చింది కూడా.
అయితే, బీఎస్-6 వాహన ప్రమాణాల్లో ప్రత్యేకంగా ఆర్ డీఈ నిబంధనలు పొందుపరిచింది కేంద్రం. ఆర్ డీఈ అంటే రియల్ డ్రైవ్ ఎమిషన్స్ అని అర్థం. కార్ల తయారీదారులు తమ మోడళ్లలో కర్బన ఉద్గారాలకు సంబంధించిన రియల్ టైమ్ డేటాను ప్రదర్శించే సాంకేతిక వ్యవస్థలను పొందుపరచాల్సి ఉంటుంది. అయితే, గతంలో రూపొందించిన కొన్ని కార్లలో రియల్ టైమ్ ఎమిషన్స్ డేటా చూపించే సాంకేతికత లేదు. ఇలాంటి పాత మోడళ్లకు కేంద్రం ఏప్రిల్ 1తో తుది గడువు విధించింది.
కోతల పర్వం యాహూలోనూ.. 1700 మంది ఉద్యోగులకు గుడ్ బై!
ఏయే కార్లపై ప్రభావం ఉంటుందంటే??
రెనో క్విడ్, అమేజ్ డీజిల్ వెర్షన్ , హోండా జాజ్, హోండా డబ్ల్యూఆర్-వి, ఫోర్త్ జనరేషన్ హోండా సిటీ, హ్యుండాయ్ ఐ20 డీజిల్ వెర్షన్, గ్రాండ్ ఐ20 నియోస్, ఆరా, మారుతి సుజుకి ఆల్టో 800, ఇగ్నిస్, సియాజ్, మహీంద్రా అల్టురాస్ జీ4 , నిస్సాన్ కిక్స్, స్కొడా ఆక్టేవియా తదితర మోడల్స్ పై కొత్త నిబంధన ప్రభావం చూపనున్నది.
పెళ్లిళ్ల సీజన్‌కు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక రాయితీ.. జూన్ 30 వరకు 10 శాతం డిస్కౌంట్ వర్తింపు