Smartphone apps (Photo Credits: Unsplash)

Hyderabad, Feb 10: స్మార్ట్ ఫోన్ (Smart Phone) అధిక వాడకంతో మానసిక సమస్యలతో (Mental Issues) పాటు కంటి చూపుపై (Eye Sight) ప్రభావం పడుతున్నట్టు ఇప్పటికే ఎన్నో నివేదికలు హెచ్చరిస్తున్నాయి. తాజాగా చీకట్లో (Dark Sight) ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ ను చూసి ఓ హైదరాబాదీ మహిళ తన కంటిచూపు పోగొట్టుకొనేవరకూ వెళ్ళింది. మంజు అనే మహిళ వృత్తిరీత్యా బ్యూటీషియన్. అయితే, కొడుకును చూసుకోవడానికి ఆ పని మానేసింది. ఇంటి పట్టునే  ఉండడంతో పొద్దుపోక స్మార్ట్ ఫోన్ కు బానిసైంది. ఎంతలా అంటే?? గంటల కొద్దీ ఫోన్ లో ఏదో ఒకటి చూస్తుండేది. రాత్రి వేళల్లో లైట్లన్నీ ఆపేసి మరీ ఫోన్ తో గడిపేది.

వీధి వ్యాపారులకు శుభవార్త.. డిజిటల్ క్రెడిట్ సేవలు ఈ ఏడాది నుంచే..

ఈ క్రమంలో ఆమె కళ్ల ముందు వలయాలు, ఉన్నట్టుండి మెరుపులు కనిపిస్తుండడం మొదలైంది. ఒక్కోసారి కళ్లకు ఏమీ కనిపించకపోవడం, దేనిపైనా దృష్టి నిలపలేకపోవడం వంటి లక్షణాలు మొదలయ్యాయి. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే స్మార్ట్ ఫోర్ విజన్ సిండ్రోమ్ (ఎస్వీఎస్)తో బాధపడుతున్నట్టు వెల్లడైంది.  ఎస్వీస్ సిండ్రోమ్ తో ఒక్కోసారి కంటిచూపు కూడా పోతుందని న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ పేర్కొన్నారు. ఆమె సమస్యను గుర్తించాక, ఫోన్ చూసే సమయం తగ్గించుకోవాలని సలహా ఇచ్చామని, ఇప్పుడామె కంటిచూపు చాలావరకు మెరుగైందని వెల్లడించారు. 18 నెలల్లో ఆమె కంటిచూ సాధారణ స్థితికి చేరుకుందని పేర్కొన్నారు.

మా జాబ్స్‌కి రక్షణ ఇవ్వండి, వెంటనే ఉద్యోగుల తొలగింపులు ఆపాలంటూ NBC న్యూస్‌ ఎడిటర్‌లు వాకౌట్, తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్