EPFO Interest Rate: ఊరిస్తారో.. ఉసూరుమనిపిస్తారో?? ఈపీఎఫ్ఓ వడ్డీపై బోర్డు నేడు కీలక నిర్ణయం.. వడ్డీరేటు కొంత పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌.. అయితే, 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.1% వడ్డీరేటును లేదా 8% వడ్డీరేటును కొనసాగించే అవకాశం

2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేటును 8.1% లేదా 8 శాతంగా నిర్ణయించే అవకాశం ఉంది. 2022-23 ఆదాయాల ఆధారంగా EPFO ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్, ఆడిట్ కమిటీ దీనిని సిఫార్సు చేసింది.

PF Account Merge (PIC @ TW)

Newdelhi, March 28: ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌) (EPF) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు (Interest Rate) మంగళవారం ఖరారు కానుంది. 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేటును 8.1% లేదా 8 శాతంగా నిర్ణయించే అవకాశం ఉంది. 2022-23 ఆదాయాల ఆధారంగా EPFO ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్, ఆడిట్ కమిటీ దీనిని సిఫార్సు చేసింది. ఈనెల 27, 28 తేదీల్లో సమావేశమవుతున్న ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ (సీబీటీ) అజెండాలో వడ్డీరేటు ఖరారు ప్రధాన అంశంగా ఉంది. అయితే వడ్డీరేటు కొంత పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సోమవారం ప్రారంభమైన సీబీటీ సమావేశంలో కార్మికుల సమస్యలపై కార్మిక సంఘాల ప్రతినిధులు, ట్రస్టీలు పలు అంశాలపై మాట్లాడారు.

Rahul Gandhi Gets Notice: రాహుల్ గాంధీకి మరో షాక్, ఏప్రిల్ 22లోగా ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు, ఇప్పటికే ఎంపీగా అనర్హత వేటు

నేటి చర్చలో ఏం ఉండొచ్చంటే?

వడ్డీ రేట్ల సవరణతో పాటు, అధిక పెన్షన్ సమస్యను నేడు బోర్డు చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు వీటిని సజావుగా అమలు చేయడానికి పలు సూచనలు చేసే అవకాశం ఉందని విశ్వనీయవర్గాలు పేర్కొన్నాయి. కాగా అధిక పింఛనుపై సుప్రీంకోర్టు తీర్పు అమల్లో భాగంగా ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తు విషయమై ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల్లో పలు సందేహాలున్నాయని, వాటికి పరిష్కారం కార్మిక సంఘాల ప్రతినిధులు చూపించాలని నిన్నటి సమావేశంలో కోరారు. ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితికి మించి అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు, ఆ అధిక వేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లించేందుకు యజమానితో కలిసి పేరా నం.26(6) కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చినవారే అర్హులన్న నిబంధనతో కార్మికులు నష్టపోతున్నారని వివరించారు. ఈ మేరకు పేరా నం.26(6) కింద మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అధిక పింఛనుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా అమలు చేస్తున్నామని, ఏమైనా మార్పులు చేస్తే తీర్పు ఉల్లంఘన కిందకు వస్తుందని కార్మికశాఖ, ఈపీఎఫ్‌ఓ ఉన్నతాధికారులు పేర్కొన్నట్లు సమాచారం.

Kabul Suicide Blast: సూసైడ్ బాంబ్ బ్లాస్ట్‌తో వణికిన కాబూల్‌, చిన్నారి సహా ఆరుగురు పౌరులు మృతి, ఆప్ఘన్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో ఘటన

గత 45 ఏండ్లలో ఇదే కనిష్టం

EPFO యొక్క సెంట్రల్ బోర్డ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, ప్రభుత్వం, కార్మికులు, యజమానుల ప్రతినిధులతో కూడిన EPFO త్రైపాక్షిక సంస్థ.. CBT నిర్ణయం EPFOపై కట్టుబడి ఉంటుంది. దీనికి కార్మిక మంత్రి నేతృత్వం వహిస్తారు. 2021-22 కోసం, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై నాలుగు దశాబ్దాల-తక్కువ వడ్డీ రేటు 8.1 శాతానికి ప్రభుత్వం ఆమోదించింది. 8.1 శాతం EPF వడ్డీ రేటు 1977-78 నుంచి 8 శాతంగా ఉన్నప్పటి నుంచి అతి తక్కువగా పేర్కొంటున్నారు. అంటే గత 45 ఏండ్లలో ఇదే కనిష్టం.