ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్ లో సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ కలకలం రేపింది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో జరిగిన ఈ సంఘటనలో ఆరుగురు మరణించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఆఫ్ఘన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలోని ఒక వ్యాపార కేంద్రం ముందు సోమవారం పేలుడు సంభవించింది. మాలిక్ అస్గర్ స్క్వేర్‌లోని సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఓ బాంబర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.

బాంబులతో తనను తాను పేల్చేసుకున్నాడు. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో మూడు నెలల్లో రెండో ఆత్మాహుతి దాడి జరిగినట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి. కాబూల్‌లోని ఇటలీకి చెందిన ప్రభుత్వేతర సంస్థకు చెందిన ఎమర్జెన్సీ ఆసుపత్రికి రెండు మృతదేహాలతోపాటు గాయపడిన 12 మందిని తరలించారు. సూసైడ్‌ బ్లాస్ట్‌లో మరణించిన ఆరుగురూ పౌరులేనని ఆఫ్ఘనిస్థాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. గాయపడిన వారిలో ముగ్గురు ఆఫ్ఘన్‌ భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు తెలిపింది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)