కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. ఆయన నివాసముంటున్న ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు పంపింది. ఏప్రిల్ 22 లోగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని తెలిపింది. ఎంపీగా అనర్హత వేటు పడటంతో ప్రభుత్వ బంగ్లాలో ఉండే అర్హత లేదని పేర్కొంది. దేశంలోని దొంగల ఇంటిపేరు మోదీనే అని ఎందుకు ఉందని 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ అన్నారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పరువునష్టం కేసు పెట్టారు. సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం లోక్‌సభ సెక్రెటేరియట్ రాహుల్‌పై అనర్హత వేటు వేసి ఎంపీగా తొలగించింది.
Here's ANI Tweet
Lok Sabha Secretariat gives notice to Congress leader Rahul Gandhi to vacate government bungalow.
The allotment of the govt bungalow will be cancelled with effect from 23.04.2023. pic.twitter.com/eymsQlPC0n
— ANI (@ANI) March 27, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)