PF Interest Credit: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీ ఖాతాలో వడ్డీ క్రెడిట్ అయింది, పీఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేయడం ఎలాగో తెలుసుకోండి?
దీపావళి సెలబ్రేషన్ ను మీఇంటికి తీసుకువచ్చింది. పండగకు ముందుగానే 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చాలామంది పీఎఫ్ అకౌంట్ దారుల అకౌంట్లలో 8.65 శాతం వరకు వడ్డీని క్రెడిట్ చేసింది.
New Delhi, October 15: ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గానైజేషన్ (EPFO)శుభవార్తను అందించింది. దీపావళి సెలబ్రేషన్ ను మీఇంటికి తీసుకువచ్చింది. పండగకు ముందుగానే 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చాలామంది పీఎఫ్ అకౌంట్ దారుల అకౌంట్లలో 8.65 శాతం వరకు వడ్డీని క్రెడిట్ చేసింది. ఇటీవలే ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధిపై వడ్డీ రేటు పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ పెంపుతో 6 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సబ్ స్రైబర్లకు ప్రయోజనం చేకూరింది. వడ్డీ రేటు పెంపు వల్ల ఈపీఎఫ్‌వోపై దాదాపు రూ.54,000 కోట్ల మేర భారం పడుతోంది. అంటే ఈ రూ.54,000 కోట్లు పీఎఫ్ ఖాతాదారులకు పెరిగిన వడ్డీ రూపంలో లభిస్తోంది.
ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈపీఎప్‌వో పోర్టల్, యుమాంగ్ ( UMANG)యాప్, మిస్‌డ్ కాల్( Missed Call),ఎస్ఎంఎస్ సర్వీస్ రూపంలో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. తొలి రెండు ఆప్షన్లలో పీఎఫ్ పాస్‌బుక్ కూడా చూడొచ్చు. ఓ సారి స్టెప్స్ చూద్దాం.
ఎస్ఎంఎస్ ద్వారా చెక్ చేసుకోవడం ఎలా ?
మీ రిజిస్టర్ మొబైల్ నుంచి EPFOHO UAN అని టైప్ చేసి 7738299899కు SMS పంపాలి. గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీ యూఎఎన్ అకౌంట్ మీ కెవైసీ వివరాలకు లింక్ అయి ఉండాలి. అలాగే యూనైటెడ్ పోర్టల్ పై రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి మాత్రమే SMS పంపాలి.
యుమాంగ్ యాప్ (Umang App)నుంచి చెక్ చేయడం ఎలా ?
ముందుగా మీ ప్లే స్టోర్ నుండి యుమాంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీ ఈపీఎఫ్ యూఎఎన్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యూఎఎన్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. అందులో అన్ని రకాల సమాచారం ఉంటుంది. మీ పీఎఫ్ వివరాలు కూడా ఉంటాయి.
ఈపీఎఫ్( EPF)పోర్టల్ ద్వారా బ్యాలెన్స్ చెకింగ్ చేయడం ఎలా ?
www.epfindia.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేయండి. మీ యూఎఎన్ యూజర్ నేమ్ (UAN User Name),పాస్ వర్డ్ (Passwords)తో అందులో లాగిన్ అవ్వండి. తర్వాత పైన కనిపించే Our Services కింద For Employees ఆప్షన్ పై క్లిక్ చేయండి. అక్కడ కనిపించే మెంబర్ పాస్‌బుక్ అనే బటన్ పై క్లిక్ చేయండి.
Missed Call ద్వారా బ్యాలెన్స్ చెకింగ్
మీ మొబైల్ నెంబర్ UAN అకౌంటుతో లింక్ తప్పనిసరిగా ఉండాలి. రిజిస్టర్ మొబైల్ నుంచి 011-22901406కు మిస్సడ్ కాల్ ఇస్తే సరిపోతుంది.మిస్డ్ కాల్ ఇవ్వగానే రెండు రింగులు వచ్చి ఆటోమాటిక్ గా కాల్ కట్ అవుతుంది.కాల్ కట్ కాగానే మీ మొబైల్ కు ఎసెమ్మెస్ రూపంలో పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు వస్తాయి. తప్పనిసరిగా మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ యూఎన్ యాక్టివేట్ అయి ఉండాలి. కెవైసీ వివరాలు కూడా కంప్లీట్ అయి ఉండాలి.