Relief To PhonePe, Google Pay: ఫోన్‌పే, గూగుల్‌ పేలకు గొప్ప ఉపశమనం.. ‘30 శాతం మార్కెట్ వాల్యూ క్యాప్‌’ రూల్ మరో రెండు సంవత్సరాలు పొడిగింపు

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ యాప్‌లు 30 శాతం మార్కెట్ వాల్యూ క్యాప్‌ అనుసరించడానికి గడువును రెండు సంవత్సరాల పాటు డిసెంబర్ 31, 2024 వరకు పొడిగించింది.

Representative Image (Photo Credit- File Image)

Newdelhi, Dec 3: ఫోన్‌ పే (PhonePe), గూగుల్ పే (Google Pay), పేటీఎం (Paytm) వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) యాప్‌లకు ప్రభుత్వం నుండి పెద్ద ఉపశమనం (Great Relief) లభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ యాప్‌లు 30 శాతం మార్కెట్ వాల్యూ క్యాప్‌ (Market Value Cap) అనుసరించడానికి గడువును రెండు సంవత్సరాల పాటు డిసెంబర్ 31, 2024 వరకు పొడిగించింది.

‘మా అమ్మగారు 5న చనిపోతారు. సెలవు ఇవ్వండి’ ప్రిన్సిపాల్ కు ఓ టీచర్ ముందస్తు లీవ్ లెటర్.. సోషల్ మీడియాలో వైరల్.. అలా ఎందుకు రాశారో తెలుసా??

వాస్తవానికి యూపీఐ మార్కెట్‌లో కొన్ని పెద్ద కంపెనీల ఆధిపత్యాన్ని నిరోధించడానికి ప్రభుత్వం గరిష్టంగా 30% మార్కెట్ వాటా నియమాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. యూపీఐ సేవలను అందించే కంపెనీ 30% కంటే ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉండకూడదు. ఈ నియమాన్ని పాటించడానికి ఎన్‌పీసీఐ యూపీఐ యాప్‌లకు 31 డిసెంబర్ 2022 వరకు సమయం ఇచ్చింది. అయితే ఇప్పుడు కాలపరిమితిని రెండేళ్లు పొడిగించారు.

పైపులైను కోసం తవ్వుతుండగా బయటపడిన మట్టిపడిత.. తెరిచి చూస్తే మిలమిల మెరుస్తూ కనిపించిన పురాతన బంగారు నాణేలు.. వాటిని చూసి ఆ ఇల్లాలు ఏం చేసింది? ఏలూరు జిల్లాలోని ఏడువాడల పాలెంలో ఘటన

ప్రస్తుతం దేశంలో 96% UPI లావాదేవీలు కేవలం మూడు యాప్‌ల ద్వారానే జరుగుతున్నాయి. వీటిలో ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎంలు ఉన్నాయి. వీటిలో 80% యూపీఐ లావాదేవీలు ఫోన్‌ పే, గూగుల్‌ పే రెండు యాప్‌ల ద్వారానే జరుగుతున్నాయి.