RBI raises UPI Lite transactions limit. (Photo credits: Pixabay)

Mumbai, OCT 09: యూపీఐ యూజర్లకు ఆర్‌బీఐ (RBI) శుభవార్త చెప్పింది. UPI 123Pay లావాదేవీల పరిమితిని రూ.5వేల నుంచి రూ.10వేలకు, యూపీఐ వాలెట్‌ లిమిట్‌ను రూ.2వేల నుంచి రూ.5వేలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం ప్రకటించారు. ఎంపీసీ సమావేశం అనంతరం శక్తికాంత దాస్‌ (Shakthikantha Das) మాట్లాడారు. డిజిటల్‌ చెల్లింపులను పెంచడం, చిన్న లావాదేవీలపై యూపీఐ లైట్‌ని (UPI Lite) ఉపయోగించే వారికి సౌకర్యాలను విస్తరించడమే పరిమితి పెంచడానికి ప్రధాన లక్ష్యమన్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుందని మార్కెట్‌ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. కోటక్ సెక్యూరిటీస్ ప్రకారం.. వినియోగదారులకు కోసం ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుందని.. యూజర్లు స్వాగతించాలన్నారు.

RBI Monetary Policy Meeting 2024: వ‌రుస‌గా ప‌దోసారి కూడా రెపో రేటు 6.5 శాతంగానే ఫిక్స్, వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ 

డిజిటల్ చెల్లింపుల ప్రయోజనాన్ని పెంచడం, చిన్న లావాదేవీల కోసం యూపీఐ లైట్‌ వాలెట్‌ని ఉపయోగించే UPI లైట్ వాలెట్‌ను ఉపయోగించే వారికి మరింత సౌకర్యాన్ని అందించడం ప్రధాన లక్ష్యం. ఇది డిజిటల్ లావాదేవీల ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుందని పేర్కొంది. యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని రూ.2వేల నుంచి రూ.5 వేలకు పెంచడంతో చిన్నపాటి విలువైన లావాదేవీలు సులభతరం కానున్నాయి. యూపీఐ లైట్ అకౌంట్‌లో యాడ్‌ చేసుకోవచ్చు. ప్రతి లావాదేవీకి బ్యాంక్ సర్వర్‌ నుంచి యాక్సెస్ లేకుండానే చెల్లింపులు చేసేలా సులభతరం కానున్నది. రోజువారీ చెల్లింపులను సులభతరం చేయనున్నది.

UPI Transactions in India: దేశంలో ప్రతిరోజు సగటున 493 మిలియన్ల UPIUPI లావాదేవీలు, కీలక విషయాన్ని వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ 

UPI 123Pay లావాదేవీల కోసం నాలుగు పద్ధతులను అందించనున్నది. యూపీఐ 123పే అనేది ఏకీకృత చెల్లింపుల ఇంటర్‌ఫేస్‌ను సురక్షితమైన పద్ధతిలో ఉపయోగిస్తుంటారు. ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారుల కోసం తక్షణ చెల్లింపుల వ్యవస్థ. యూపీఐ123Pay ద్వారా, ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఐవీఆర్‌ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) నంబర్స్‌, ఫీచర్ ఫోన్‌లలో యాప్ ఫంక్షనాలిటీ, మిస్డ్ కాల్ ఆధారిత విధానం, సౌండ్ ఆధారిత సిస్టమ్‌కి కాల్ చేయడం ద్వారా లావాదేవీలు జరిపే సదుపాయం ఉన్నది. ప్రస్తుతం 12 భాషల్లో అందుబాటులో ఉన్నది. యూపీఐ లైట్‌ ఎం-పిన్‌ ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేకుండానే యూపీఐ పేమెంట్స్‌ చేసేందుకు యూపీఐ లైట్‌ సేవలు ఉపయోగపడనున్నాయి.