Inactive UPI ID: ఏడాదిపాటు వాడకపోతే యూపీఐ ఐడీ క్లోజ్‌.. బ్యాంకులు, యాప్‌ లకు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆదేశం.. డిసెంబర్‌ 31 నాటికల్లా మార్గదర్శకాల్ని అమలు చేయాలంటూ సూచన.. ఎందుకు ఈ నిర్ణయం అంటే?

నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ఆదేశించింది.

UPI ID (Credits: X)

Newdelhi, Nov 18: వాడకంలో లేని యూపీఐ ఐడీలు (UPI ID), నంబర్లను డీయాక్టివ్‌ (Deactivate) చేయాలంటూ గూగుల్‌ పే (GooglePay), పేటీఎం (Paytm), ఫోన్‌ పే (PhonePe) తదితర పేమెంట్‌ యాప్స్‌, బ్యాంక్‌ లను..  నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ఆదేశించింది. ఒక ఏడాదికాలంగా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగని యూపీఐ యాప్‌ లు, యూపీఐ ఐడీలు, యూపీఐ నంబర్లను ప్రొవైడర్లు గుర్తించి, ఆ కస్టమర్‌ ఐడీలను, నంబర్లను డీయాక్టివేట్‌ చేయాలని ఎన్‌పీసీఐ సర్క్యులర్‌లో పేర్కొంది. 2023 డిసెంబర్‌ 31 నాటికల్లా ఈ మార్గదర్శకాల్ని అమలు చేయాలంటూ థర్డ్‌పార్టీ యాప్‌ ప్రొవైడర్లు (టీపీఏపీ), పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ (పీఎస్‌పీ) బ్యాంకుల్ని కోరింది.

KTR Comments on Azharuddin: ఇండియా వరల్డ్ కప్ గెలవడం ఖాయం, అజారుద్దీన్ తో గల్లీ క్రికెట్ ఆడండి కానీ, ఓటు మాత్రం బీఆర్ఎస్ వేయండి, రోడ్ షో లో మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్

ఎందుకు ఈ నిర్ణయం??

ఖాతాదారులు మొబైల్‌ ఫోన్‌ నంబర్లను మార్చుకున్నపుడు వారి ఖాతాల నుంచి వారికి సంబంధం లేని ఖాతాలకు డబ్బు బదిలీ అయ్యే ప్రమాదం ఉన్నందున ఎన్‌పీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. పలువురు కస్టమర్లు కొత్త మొబైల్‌ నంబర్‌ ను తీసుకున్నప్పటికీ, పాత నంబరును బ్యాంకింగ్‌ సిస్టమ్‌ నుంచి తొలగించకపోవడం, పాత నంబరును మరొకరికి టెలికం ఆపరేటరు జారీచేయడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతుందని ఎన్‌పీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

Mystery' Disease Sweeps Bihar: గయలో మరో అంతుచిక్కని వ్యాధి, తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులతో 300 మందికి పైగా ఆస్పత్రికి.. లాంగ్డా జ్వరం అని పిలుస్తున్న గ్రామవాసులు, లక్షణాలు ఏంటంటే..