Re 1 For 1 GB: రూపాయికే 1జీబి డేటా, జియోకి సవాల్ విసురుతున్న బెంగుళూరు వైఫై డబ్బా స్టార్టప్ కంపెనీ, ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
ముఖేష్ అంబానీ (Mukesh Ambani) జియో రాకతో దేశంలో డేటా టారిఫ్ వార్ మొదలైంది. ఆకాశంలో ఉన్న డేటా ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూశాయి. అయితే ఇప్పుడు టెలికాం రంగాన్ని శాసిస్తున్న జియోకి ఓ స్టార్టప్ కంపెనీ సవాల్ విసురుతోంది. బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఒక రూపాయికే 1GB డేటాను (Re 1 For 1 GB) అందిస్తూ రిలయన్స్ జియోకి షాక్ ఇస్తోంది.
Bengaluru,January 25: జియో రాకతో (Jio) దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న విషయం విదితమే. ముఖేష్ అంబానీ (Mukesh Ambani) జియో రాకతో దేశంలో డేటా టారిఫ్ వార్ మొదలైంది. ఆకాశంలో ఉన్న డేటా ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూశాయి. అయితే ఇప్పుడు టెలికాం రంగాన్ని శాసిస్తున్న జియోకి ఓ స్టార్టప్ కంపెనీ సవాల్ విసురుతోంది. బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఒక రూపాయికే 1GB డేటాను (Re 1 For 1 GB) అందిస్తూ రిలయన్స్ జియోకి షాక్ ఇస్తోంది.
ఛార్జింగ్‌లో ఉండగా పేలిన మొబైల్ ఫోన్
Wifi Dabba పేరుతో బెంగుళూరులో 2016లో ఓ స్టార్టప్ కంపెనీ మొదలైంది. ఈ స్టార్టప్ కంపెనీ ప్రతిఒక్కరికి Gigabit WiFi నెట్ వర్క్ యాక్సస్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. హైస్పీడ్ ఇంటర్నెట్ ను కేవలం రూ. 1కు 1GB వరకు అందిస్తోంది. దీనికి అదనంగా ఎలాంటి సబ్ స్ర్కిప్షన్ ఫీజు, siging up లేదా Installation ఫీజులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.ఇప్పటికే ఈ వైఫై సర్వీసు బెంగళూరులో ఎంతో పాపులర్ అయింది.
100 శాతం కవరేజ్ అందించడమే లక్ష్యంగా supernodes కాన్సెప్ట్ తో Wifi Dabba వైర్ లెస్ నెట్ వర్క్ ను కంపెనీ విస్తరిస్తోంది. నగరవ్యాప్తంగా పెద్ద భవనాలతో పాటు అన్ని టవర్లలోనూ Wifi Dabba నెట్ వర్క్ ను ప్రతిఒక్కరూ యాక్సస్ చేసుకునేలా సూపర్ నోడ్స్ కనెక్టవిటీని అందిస్తోంది.
3 రోజుల్లో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ
దీనికి ఇతర కేబుల్ నెట్ వర్క్ మాదిరిగా Fibre optic కనెక్టవిటీ అవసరం లేదు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకించి స్పెక్ర్టమ్ కొనుగోలు చేయాల్సిన పనిలేదు. కేవలం ఓ డబ్బా ఉంటే చాలు. ఈ Wifi Dabba నెట్ వర్క్ ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే 00అందుబాటులో ఉంది. ఆసక్తి గల యూజర్లు కంపెనీ వెబ్ సైట్లో రిజిస్ట్రర్ చేసుకోవచ్చు.