IPL Auction 2025 Live

Police Case On Dimple Hayathi: ఐపీఎస్ అధికారి కారును ఢీకొట్టి రచ్చ చేసిన హీరోయిన్ డింపుల్ హయతి.. కేసు నమోదు.. జూబ్లీహిల్స్ లో ఘటన

దీంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Dimple Hayati (Credits: Twitter)

Hyderabad, May 23: సినీ హీరోయిన్, ఐటెం గర్ల్ డింపుల్ హయతి (Dimple Hayathi) రచ్చ రచ్చ చేశారు. దీంతో హైదరాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్ (Jublihills) పోలీసులు (Police) కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని ఎస్కేఆర్ అపార్ట్ మెంట్స్ లో డింపుల్ హయతితో పాటు ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే ఉంటున్నారు. రాహుల్ హెగ్డే ప్రస్తుతం ట్రాఫిక్ డీసీపీగా ఉంటున్నారు. రాహుల్ కారును ఢీకొట్టిన డింపుల్.. ఆనంతరం ఆ ప్రభుత్వ వాహనాన్ని కాలుతో తన్నింది. ఈ ఘటనపై రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై పోలీసులు సెక్షన్ 341, 279, 353 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధానంగా ప్రభుత్వ వాహనాన్ని (ఆస్తి) ధ్వంసం చేయడం, ప్రభుత్వ అధికారిని దుర్భాషలాడటం వంటి అభియోగాలను ఆమెపై మోపారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాలంటూ పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు.

Birth to Five children: ఒకే కాన్పులో ఐదుగురు శిశువుల జననం.. ఝార్ఖండ్‌లోని రిమ్స్‌ ఆసుపత్రిలో ఘటన.. తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నారన్న వైద్యులు

రాహుల్ ఏమన్నారంటే?

రాహుల్ హెగ్డే మాట్లాడుతూ... డింపుల్ హయతి తొలి నుంచి కూడా ఇలాగే వ్యవహరిస్తోందని చెప్పారు. తాను పలుమార్లు నచ్చచెప్పినా ఆమె పద్ధతి మార్చుకోలేదని అన్నారు.

Rs. 2000 Note Withdrawn: నేటి నుంచి రూ. 2000 నోటు మార్పిడి షురూ.. 55 వేల బ్యాంక్‌ బ్రాంచీలు రెడీ.. రోజుకు ఎన్ని మార్చుకోవచ్చంటే??