Aadhi Engaged to Nikki Galrani: ఆ హీరో, హీరోయిన్ల పెళ్లి ఖరారు! ఓ ఇంటివాడు కాబోతున్న ఆదిపినిశెట్టి, అట్టహాసంగా ప్రియురాలితో నిశ్చితార్ధం, అక్కకు పెళ్లికాకుండానే మ్యారేజ్ చేసుకుంటున్న కన్నడ బ్యూటీ

కన్నడ బ్యూటీ నిక్కీ గల్రానీని (Nikki Galrani) మనువాడనున్నాడు.ఈ విషయాన్ని ఆదినే స్వయంగా సోషల్​ మీడియా ద్వారా తెలపగా.. మార్చి 24వ తేదీన కుటుంబసభ్యుల సమక్షంలో సంప్రదాయబద్దంగా నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలను పోస్ట్​ చేశాడు.

Hyderabad, March 26: సౌత్ సినీ దర్శకుడు రవిరాజా పినిశెట్టి (Raviraja pinishetty) కుమారుడు, తమిళ-తెలుగు సినిమాల నటుడు ఆది పినిశెట్టి (Aadhi Pinisetty ) ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తెలుగులో గుండెల్లో గోదారి’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆది.. ‘సరైనోడు’, ‘నిన్ను కోరి’, ‘రంగస్థలం’, ‘నీవెవరో’’,’ యూ టర్న్‌’, ‘గుడ్‌ లక్‌ సఖి’ వంటి చిత్రాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా బిజీగా ఉండగానే తోటి నటి, తనతో నటించిన హీరోయిన్ ను పెళ్లాడేందుకు సిద్దమయ్యాడు. కన్నడ బ్యూటీ నిక్కీ గల్రానీని (Nikki Galrani) మనువాడనున్నాడు.ఈ విషయాన్ని ఆదినే స్వయంగా సోషల్​ మీడియా ద్వారా తెలపగా.. మార్చి 24వ తేదీన కుటుంబసభ్యుల సమక్షంలో సంప్రదాయబద్దంగా నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలను పోస్ట్​ చేశాడు. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది.

ఆది హీరోయిన్ నిక్కీ గల్రాని(Nikki Galrani)తో ప్రేమలో ఉన్నాడని తమిళ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. మరకతమణి (marakathamani) సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించగా.. 2017లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అప్పుడే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

RRR OTT Release Date And Time: ఓటీటీలో RRR మూవీ ఎప్పుడో తెలుసా? క్రేజీ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న సంస్థలు ఇవే! ఓటీటీలో త్రిపుల్ ఆర్ చూడాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే

అప్పటి నుండి పలుమార్లు కెమెరాల కంట పడడంతో పాటు అప్పట్లో ఆది తండ్రి, దర్శకుడు రవిరాజా పుట్టినరోజు వేడుకలలో కూడా కుటుంబ సభ్యులతో నిక్కీ కలిసి కనిపించడంతో ఈ జంట పెళ్లిపై కథనాలు మొదలయ్యాయి. ఈ మధ్య రహస్య నిశ్చతార్ధ ఏర్పాట్లపై కూడా వార్తలు రాగా ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ ఆది ప్రకటించాడు. మొత్తంగా 39 ఏళ్ల ఆది.. 30 ఏళ్ళ నిక్కీ గల్రానితో త్వరలోనే ఏడడుగులు నడవబోతున్నాడు. బుజ్జిగాడు సినిమాలో త్రిష చెల్లిగా నటించిన సంజనా గల్రాని చెల్లెలే నిక్కీ గల్రాని కాగా సంజనా ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ చెల్లి మాత్రం పెళ్లి పీటలెక్కబోతుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif