Pawan Kalyan Comments Row: నన్ను కూడా లాగావు పవన్, నీ వ్యాఖ్యలకు తప్పకుండా బదులిస్తానని తెలిపిన మోహన్ బాబు, టికెట్ల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వంపై మండిపడిన జనసేన అధినేత

తెలుగు సినీ ప‌రిశ్ర‌మపై ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రిపై సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌న‌వ్ క‌ల్యాణ్ (Pawan Kalyan) తీవ్రంగా స్పందించిన విష‌యం తెలిసిందే. రిప‌బ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ..సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన విష‌యాల‌ను ఏపీ సీఎం జ‌గ‌న్ (YS Jagan MohanReddy) దృష్టికి తీసుకెళ్లాల‌ని మోహ‌న్ బాబును కూడా విజ్ఞ‌ప్తి చేశారు.

Mohan Babu (Photo-Facebook)

తెలుగు సినీ ప‌రిశ్ర‌మపై ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రిపై సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌న‌వ్ క‌ల్యాణ్ (Pawan Kalyan) తీవ్రంగా స్పందించిన విష‌యం తెలిసిందే. రిప‌బ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ..సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన విష‌యాల‌ను ఏపీ సీఎం జ‌గ‌న్ (YS Jagan MohanReddy) దృష్టికి తీసుకెళ్లాల‌ని మోహ‌న్ బాబును కూడా విజ్ఞ‌ప్తి చేశారు. ఈ నేప‌థ్యంలోప‌వ‌న్ ప్ర‌సంగంపై టాలీవుడ్ (Tollywood)న‌టుడు మోహ‌న్ బాబు (Mohanbabu) సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు.

నా ప్రియమైన పవన్ కల్యాణ్ అంటూ ఓ ప్రకటన చేశారు. నా చిరకాల మిత్రుడి సోదరుడైన పవన్ కల్యాణ్ (Pawan Kalyan). నువ్వు నాకంటే చిన్నవాడివి కాబట్టి ఏకవచనంతో సంబోధించాను అని వెల్లడించారు. అయితే పవన్ కల్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమీ లేదని పేర్కొన్నారు. చాలాకాలానికి తనను ఈ వ్యవహారంలోకి లాగావు. సంతోషం అంటూ పవన్ ను ఉద్దేశించి మోహన్ బాబు వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం ‘మా’ ఎన్నికల కోలాహలం నెలకొని ఉంది, అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు ముగిసిన తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకు హృదయపూర్వకంగా సమాధానం చెబుతానని మోహన్ బాబు స్పష్టం చేశారు. ఈ లోపు నువ్వు చేయాల్సిన ముఖ్య‌మైన ప‌ని, నీ సోద‌రుడి లాంటి విష్ణుబాబుకు, అత‌ని టీంకు ఓటు వేసి గెలిపించాల‌ని కోరుకుంటున్నా. ధ‌న్య‌వాదాలు’ అని ట్వీట్ సందేశంలో పేర్కొన్నారు మోహ‌న్ బాబు.

Here's Mohan BabuTweet

సినిమా టికెట్లను ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో జనసేనాధినేత ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టికెట్ విక్రయం ప్రభుత్వం చేతిలోకి వెళ్తే అది నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా నష్టం కలిగిస్తుంది కదా.. ఈ విషయం గురించి ఎందుకు ఎవరూ మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు. మన ఇండస్ట్రీపై ప్రభుత్వం పెత్తనం ఏంటి అంటూ పవన్ ప్రశ్నలు సంధించాడు. వైసీపీ తో సత్సంబంధాలు ఉన్న మోహన్ బాబు లాంటి వాళ్ల‌ను జగన్‌తో వెళ్లి మాట్లాడండి అంటూ సలహాలు కూడా ఇచ్చాడు పవన్ కళ్యాణ్. లేకపోతే రేపటి రోజు మీ విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రభుత్వం చేస్తాడు అంటూ హెచ్చరించాడు.

ఏపీలో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, సర్కారు నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్‌లో అమలు చేయాలి, ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ తీసుకువస్తున్నామని తెలిపిన మంత్రి పేర్ని నాని

మీ దాకా వచ్చే వరకు తెచ్చుకోకండి మోహన్ బాబు గారు.. మీరు కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తులు అని గుర్తుపెట్టుకోండి అంటూ పవన్ ఓపెన్ కామెంట్స్ చేశాడు. మీరు ఎవరికీ ఊడిగం చేయాల్సిన అవసరం లేదు.. మనం కష్టపడి సంపాదిస్తున్నపుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో చాలా మందిని ఆలోచింపజేస్తున్నాయి. పార్టీలకు అతీతంగా సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాలి అంటే కచ్చితంగా ముందుకు రావాల్సిన సమయం వచ్చింది అని.. ఇప్పుడు కూడా ముందుకు రాకపోతే బానిసత్వం మరి ఎక్కువ అవుతుంది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఇది ఎటువైపు దారి తీస్తుందో తెలియక.. ఆసక్తిగా రాబోయే పరిస్థితులను గమనిస్తున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Amit Shah-Babu-Pawan: విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్.. అందరం కలిసి దాన్ని లాభాల్లోకి తీసుకొద్దాం.. ఉండవల్లిలో బాబు, పవన్ తో జరిగిన భేటీలో అమిత్ షా

Pawan Kalyan:నంబూరులో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్..స్వచ్ఛ కార్మికులకు సన్మానం, స్వయంగా ట్రాక్టర్ నడిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

AP Cabinet Decisions: వచ్చే విద్యాసంవత్సరం నుండి తల్లికి వందనం..రాజధాని అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, పీఎం కిసాన్,అన్నదాత సుఖీభవ.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

KTR On CM Revanth Reddy: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై ఛీటింగ్ కేసులు పెట్టాలి...జనవరి 21న నల్గొండలో రైతు ధర్నా చేస్తామన్న మాజీ మంత్రి కేటీఆర్, షాబాద్ రైతు దీక్షకు భారీగా తరలివచ్చిన అన్నదాతలు

Share Now