AP Minister Perni Nani: ఏపీలో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, సర్కారు నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్‌లో అమలు చేయాలి, ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ తీసుకువస్తున్నామని తెలిపిన మంత్రి పేర్ని నాని
Andhra Pradesh Transport Minister Perni Nani(photo-Twitter)

Amaravati, Sep 20: ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, థియేటర్‌ యజమానులు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా చిత్ర పరిశ్రమల నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలని అగ్ర కథానాయకుడు చిరంజీవి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఏపీ ప్రభుత్వంతో (AP Govt) సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, థియేటర్‌ యజమానులు భేటీ అయ్యారు.

ఈ భేటీలో ఆన్‌లైన్‌ టికెట్ల వ్యవహారంపై సమావేశంలో చర్చ జరిగింది. త్వరలోనే ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతామని ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని (AP Minister Perni Nani) అన్నారు. సినీ ప్రముఖలతో సమావేశం ( Perni Nani Meeting With Film Industry) అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిరంజీవి అంటే సీఎం జగన్‌కు గౌరవం ఉందని, సోదరభావంతో చూస్తారని అన్నారు. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి తాజా సమావేశంలో వారికి వివరించాం. త్వరలోనే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ ( Online Movie Ticket Booking System) ద్వారా ప్రజలకు వినోదాన్ని అందిస్తామని మంత్రి అన్నారు.

విజయవాడ నుంచి హెరాయిన్‌ సరఫరా వార్త అబద్దం, ప్రకటన విడుదల చేసిన విజయవాడ సీపీ శ్రీనివాసులు, గుజరాత్‌లో ముంద్రా పోర్టు వద్ద రూ. 9 వేల కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

సినిమాపై మాకున్న ఆపేక్షను ఎందుకు సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలెవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శకతతో కూడిన రేట్లను అమలు చేస్తాం. ప్రభుత్వ నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్‌లో అమలు చేయాలి. అందుకు ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా వినోదాన్ని అందించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిది. ఇందుకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చింది.

ప్రతిపక్షం​ ఓటమిని అంగీకరించలేని పరిస్థితుల్లో ఉంది, ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపిన సీఎం వైఎస్‌ జగన్‌, గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

చట్టాలకు అతీతంగా వ్యాపారాలు చేసే పరిస్థితి ఉత్పన్నం అవదని నేను అనుకుంటున్నా. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్‌ యజమానులు ‘ప్రభుత్వం ఇలా చేస్తే బాగుంటుంది’ అని అనేక విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. వారి విజ్ఞప్తులను పరిశీలించి సాధ్యమైనంత మేర సానుకూలంగా స్పందించాం. ఈ రోజు జరిగిన సమావేశంలో బెనిఫిట్‌ షోల గురించి ఒక్కరు కూడా అడగలేదని పేర్ని నాని తెలిపారు.