CM YS Jagan Review: ప్రతిపక్షం​ ఓటమిని అంగీకరించలేని పరిస్థితుల్లో ఉంది, ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపిన సీఎం వైఎస్‌ జగన్‌, గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy (Photo-Twitter)

Amaravati, Sep 20: గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష (CM YS Jagan reviews on housing scheme) నిర్వహించారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంపై (One Time Settlement Scheme) ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకున్న వారికి వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకం వర్తిస్తుంది. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంగా పేరు ఖరారు చేసిన అధికారులు.. పథకం అమలు కోసం రూపొందించిన విధి విధానాలపై సమావేశంలో చర్చించారు. ప్రతిపాదనలను సీఎంకు అధికారులు వివరించారు.

సెప్టెంబరు 25 నుంచి డేటాను ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అప్‌లోడ్‌ చేయనుంది. వివిధ సచివాలయాలకు ఈ డేటాను పంపనున్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకం సొమ్మను చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒన్‌టైం సెటిల్‌మెంట్‌కు అర్హులైన వారి జాబితాలు ఖరారైన తర్వాత నిర్దేశిత రుసుము చెల్లింపుతో వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంకు మంచి స్పందన వస్తోందని సీఎంకు అధికారులు తెలిపారు. ఓటీఎస్‌ పథకం అమలుకు గ్రామ, వార్డు సచివాలయాలు పాయింట్‌గా ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

జగన్ సర్కారు దూకుడు, ఎక్కడా కానరాని వ్యతిరేకత, పరిషత్ ఎన్నికల్లో ఏకపక్ష విజయం, టీడీపీకి మరోసారి చుక్కెదురు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు ఇవే

దీంతో పాటుగా పేదలందరికీ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై, జగనన్న కాలనీల్లో మౌలికసదుపాయాల కల్పనపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, రెవెన్యూశాఖ (భూములు) ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సెక్రటరీ రాహుల్‌ పాండే, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ ఎన్‌ భరత్‌ గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వచ్చే ఏడాది విద్యా కానుక కిట్‌లో భాగంగా అందించనున్న స్కూల్‌ బ్యాగు, బూట్ల నాణ్యతను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం స్వయంగా పరిశీలించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో బూట్లు, స్కూల్‌ బ్యాగులను ముఖ్యమంత్రికి పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్‌, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చూపించారు.

దుమారం రేపుతున్న అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు, ‘ఓ మై సన్’ పై క్లారిటి ఇచ్చిన టీడీపీ మాజీ మంత్రి, అయ్యన్న క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతల డిమాండ్, చింతకాయలపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఎవరేమన్నారో వారి మాటల్లో..

పరిషత్ ఎన్నికల్లో విజయంపై జగన్ స్పందించారు. ప్రజలందరి చల్లని దీవెనలతో పరిషత్‌ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని ముఖ్యమంత్రి వైఎస్‌​ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈ ఫలితాలు ప్రతి కుటుంబం, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని తెలిపారు. పరిషత్‌ ఎన్నికల విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అక్షరాల 13,081 పంచాయతీలకు గాను 10,536 పంచాయతీల్లో(81 శాతం) వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఏకంగా 75కు 74 చోట్ల (99 శాతం) వైఎస్సార్‌ అభ్యర్థులే గెలిచారని తెలిపారు.

86 శాతం ఎంపీటీలు, 98 శాతం జడ్పీటీసీ స్థానాల్లో గెలిపిచారని సీఎం జగన్‌ తెలిపారు. ప్రతి ఎన్నికల్లో సడలని ఆప్యాయతను ప్రజలు అందిస్తున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయన్నారు. అన్యాయపు మీడియా సంస్థలు అబద్ధాన్ని నిజం చేయాలని చూశారని అన్నారు. ప్రతిపక్షం​ ఓటమిని కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో ఉందని తెలిపారు. ప్రజలకు మంచి జరగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందన్నారు. కోవిడ్‌ పేరుతో గతంలో కౌంటింగ్‌ కూడా వాయిదా వేయించారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తోడుగా ఉన్న ప్రజలకు రుణపడి ఉంటానని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.