TDP vs YSRCP: దుమారం రేపుతున్న అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు, ‘ఓ మై సన్’ పై క్లారిటి ఇచ్చిన టీడీపీ మాజీ మంత్రి, అయ్యన్న క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతల డిమాండ్, చింతకాయలపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఎవరేమన్నారో వారి మాటల్లో..
ayyanna patrudu (Photo-Video Grab)

Amaravati, Sep 18: టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులపై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ (YSRCP MLA Jogi Ramesh) చంద్రబాబు నివాసాన్ని ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వైసిపి గుండాలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడికి (protest outside Chandra babu Naidu's house) దిగారని టిడిపి నేతలు ఆరోపిస్తుంటే, వైసీపీ నేతలపై, జగన్ పై అయ్యన్న చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వైసిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. అయ్యన్న మాటల వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఎమ్మెల్యే జోగి రమేశ్ ఆరోపిస్తున్నారు. క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో తిరగనివ్వమంటూ ఎమ్మెల్యే హెచ్చరించారు. నిన్న జరిగింది ఆరంభం మాత్రమేనని, భాష మారకపోతే అది కంటిన్యూ అవుతుందని జోగి రమేష్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

అయ్యన్న పాత్రుడు, చంద్రబాబుపై డీజీపీ గౌతం సవాంగ్‌కి వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారిని అరెస్ట్‌ చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. అనంతరం మీడియాతో వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ టీడీపీ నేతల వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబు డైరెక్షన్‌లో అంతా జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌పై దాడిని ఖండిస్తున్నామన్నారు. రాజకీయంగా టీడీపీకి మనుగడ లేదన్నారు.

ఏపీలో ఇకపై డిగ్రీ నుంచి ఇంగ్లీష్ మీడియం, విద్యార్థులంతా ఇంగ్లిష్ మీడియంలోనే ప్రవేశాలు పొందాల్సి ఉంటుందని తెలిపిన ఉన్నత విద్యాశాఖ

అంబటి రాంబాబు : తాజాగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై (Ayyanna Patrudu controversial Comments) తీవ్రంగా స్పందించారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూసిన తర్వాత టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు నిరాశలో ఉన్నారని వైఎస్ఆర్‌సిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న చేసిన ఘాటు వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, అంబటి రాంబాబు అయ్యన్నపాత్రుడుకి మానసిక స్థితి బాగా లేదని పేర్కొన్నారు. కోడెల రెండవ వర్ధంతి కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

అయ్యన్నపాత్రుడు (TDP Ayyanna Patrudu) తన భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అంబటి రాంబాబు, కోడెల శివప్రసాద్ మరణానికి టిడిపి, చంద్రబాబే కారణమని ఆరోపణలు గుప్పించారు. టీడీపీకి ఏపీ ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతల్లో మార్పు రావడం లేదని అంబటి రాంబాబు విమర్శించారు. అధికారం పోగొట్టుకోవడం తో అవాకులు చెవాకులు పేలుతున్నారని నిప్పులు చెరిగారు.

అయ్యన్న పాత్రుడు వివాదాస్పసద వ్యాఖ్యలు: కోడెల శివప్రసాద్ ద్వితీయ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా గుంటూరు జిల్లా నకిరేకల్ లో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) సీఎం జగన్ మోహన్ రెడ్డిని, వైసిపి నేతలను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు. జగన్ ను తీవ్ర పదజాలంతో దూషించారు. అలాగే ఎస్పీలను ఉద్దేశించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారుమాంసం, చేపలు వ్యాపారం చేయాలనుకుంటున్న ప్రభుత్వం ఎమ్మెల్యే అంబటి అధ్యక్షతన మల్లెపూల వ్యాపారం చేస్తే బాగుంటుంది అంటూ అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.

జగన్ సర్కారు దిగజారిందని జగన్ కు మల్లెపూల వ్యాపారం చేయడమే మిగిలిందని అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. అంతేకాదు పనికిమాలిన వాళ్లంతా పాలకులు అయితే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో ఏపీని చూస్తే అర్థమవుతుందని అసమర్థ పాలనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్దం పడుతోందని అయ్యన్న ధ్వజమెత్తారు. లక్షల కోట్ల అప్పులు చేస్తూ రాష్ట్ర భవిష్యత్తును అధోగతి పాలు చేస్తున్నారని జగన్ పై మండిపడ్డారు. చివరకు చెత్త, మరుగుదొడ్ల పై పన్ను వేస్తున్న చెత్తనా... అంటూ జగన్ ను టార్గెట్ చేస్తూ అయ్యన్నపాత్రుడు నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే తాజాగా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అవంతి శ్రీనివాస్, అలాగే హోమం మంత్రి సుచరితపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై గుంటూరు జిల్లా నకరికల్లు పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. కండ్లకుంటలో జరిగిన కోడెల వర్ధంతి సభలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ సర్పంచ్, వైసీపీ నేత కంఠంనేని కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో అయ్యన్నపాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి, ఐపీఎస్ అధికారులను కించపరిచేలా అయ్యన్నపాత్రుడు మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

ఇరు వర్గాలపై మొత్తం నాలుగు కేసులు నమోదు: ఇక ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘటనలపై తాడేపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇరు వర్గాలపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. టీడీపీ నేతలు జంగాల సాంబశివరావు, తిరుమలయ్య, బుస్సా మధుసూదన్ రావు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మూడు కేసులు నమోదయ్యాయి. మరోవైపు జోగి రమేష్ డ్రైవర్ తాండ్ర రాము ఫిర్యాదుతో టీడీపీ నేతలపై ఐపీసీ సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 3(1), 3(2) కింద, IPC సెక్షన్‌ 144, 148, 149, 188, 269, 270, 294బి, 341, 352, 427. 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు.

అయ్యన్న వ్యాఖ్యలను ఖండించిన ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం: పోలీస్ అధికారులపై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. ఈ మేరకు ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి ద్వారకా తిరుమలరావు ప్రకటనను విడుదల చేశారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఎస్పీ నా కొడుకులు అని సంభోదించడం ఆక్షేపణీయం. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు హుందాతనంతో, విలువలతో, స్థాయికి తగ్గట్టు వ్యవహరించాల్సిన అవసరం ఎంతయినా ఉందంటూ పేర్కొన్నారు.

ఏపీలో సెప్టెంబర్ 30 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగింపు, ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్యశాఖ, మాస్క్ లేకుంటే భారీ జరిమానా

రాజకీయ విశృంఖలత్వం మితిమీరక ముందే ఇటువంటి ప్రవర్తనను సభ్య సమాజం గుర్తించాల్సిన అవసరం ఎంతయినా ఉందంటూ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నో సమస్యల మధ్య విధులు నిర్వహిస్తున్న మా పట్ల అనుచితంగా వ్యవహరించడం ఎంత వరకు సబబు. ఒక పోలీసు ఉన్నతాధికారిని దూషించడమంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనునిత్యం శ్రమిస్తున్న పోలీసు వ్యవస్థను తూలనాడడంలో ఔచిత్యం ఏమిటో ఆలోచించుకోవాలి. ఇష్టానుసారం మాట్లాడి వ్యవస్థలను అభాసుపాలు చేయొద్దు. పరిధిని అతిక్రమించి మాట్లాడొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ఐపీఎస్‌ అధికారుల సంఘం కార్యదర్శి తిరుమలరావు పేర్కొన్నారు.

మందు ఉంటే మత్తు మాటలు అయ్యన్నకు అలవాటు: జోగి రమేష్ : అయ్యన్న నీతి మాటలు వింటే దెయ్యాలు గుర్తుకు వస్తున్నాయని, కోట్ల రూపాయలు అక్రమాస్తులు గడించిన అయ్యన్న బండారం అందరికీ తెలుసని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సొంత ఇల్లు సహా 358 సర్వే నంబర్‌లో 22ఎలో ఉంటే అధికార పైరవీలతో మార్చుకున్న నాయకుడు అయ్యన్న అని మండిపడ్డారు. రంగు రాళ్ల కుంభ కోణంలో అయ్యన్న దోపిడి అందరికీ తెలుసని, కరక క్వారీ తవ్వకాల్లో అయ్యన్న రంగు ఎప్పుడో బయటపడిందని అన్నారు. మందు ఉంటే మత్తు మాటలు, మందు లేకపోతే మాయమాటలు అయ్యన్నకు అలవాటు దుయ్యబట్టారు.

చోడవరం బ్రిడ్జి పూర్తి కాకపోతే ఆరు నెలల్లో గుండు గీయించుకుంటానని కనిపించకుండా పోయాడని ఎద్దేవా చేశారు. అయ్యన్న గుండు గీయించుకోలేక తప్పించుకున్నా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఆ బ్రిడ్జి పూర్తి చేశామని తెలిపారు. తొడలు గొట్టడం, మీసాలు తిప్పడం కాదని ప్రజాక్షేత్రంలో ఉండాలన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన చేస్తున్నారని తెలిపారు. సంక్షేమ పాలనను చూసిన టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. సీఎం, మంత్రులు, మహిళలపై అయ్యన్న వ్యాఖ్యలు అభ్యంతరకరమని అన్నారు. గూండాలు, రౌడీ మూకలను పంపించి చంద్రబాబు తనపై దాడి చేయించారని అన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేని జోగి రమేష్‌ డిమాండ్‌ చేశారు.

జోగి రమేష్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, ఆయన అనుచరులపై చంద్రబాబు ఇంటి ఎదుట టీడీపీ నాయకులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న తీసుకువచ్చిన మరికొందరు రౌడీలు రమేష్‌ను తోసివేసి.. కర్రలు, రాళ్లతో వీరంగం సృష్టించారు. సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడిని టీడీపీ నుంచి సస్పెండ్‌ చేయాలని కోరుతూ జోగి రమేష్‌ తన అనుచరులతో కలసి కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న టీడీపీ నేతలు.. రాళ్లు, కర్రలు సిద్ధం చేసుకుని కిరాయి రౌడీలు, పార్టీ కార్యకర్తలతో అక్కడ మోహరించారు. చంద్రబాబు నివాసం వద్దకు జోగి రమేష్‌ కారు రాగానే మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత బుద్దా వెంకన్న, కొందరు కార్యకర్తలు, రౌడీషీటర్లు రెచ్చిపోయి ఆయన కారుపై దాడి చేశారు.

వెంటనే జోగి రమేష్‌ కిందకు దిగి తాను శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తే, ఇదేం పని.. అని ప్రశ్నిస్తుండగా బుద్దా వెంకన్న జోగి రమేష్‌ను వెనక్కు నెట్టేశారు. మీ ముఖ్యమంత్రికి, మీకు చెమడాలు తీస్తాం. ఇక నుంచి మిమ్మల్ని రోడ్ల మీద తిరగనీయం. ఏం చేస్తారో చేసుకోండి’ అంటూ జెండా కర్రలతో దాడి చేశారు. వెంటనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రోడ్డు మీదకు వచ్చి రాళ్లు విసిరారు. ఇరు వర్గాలను చెల్లా చెదురు చేసి.. ఎమ్మెల్యే జోగి రమేష్‌ను పోలీసులు తమ వాహనంలో రెండు కిలోమీటర్లు తీసుకెళ్లాక, టీడీపీ రాష్ట్ర నాయకుడు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ మాజీ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం మళ్లీ దాడి చేశాడు. కాన్వాయ్‌ను ఆపి కారు అద్దంపై చెప్పుతో కొట్టాడు. ఆ తర్వాత బండ రాయి తీసుకుని కారు అద్దాలను పగలగొట్టి డ్రైవర్‌పై దాడికి యత్నించాడు.

ప్రజలు బుద్ధి చెప్పినా అయ్యన్నకు సిగ్గు రాలేదు: ఆర్కే రోజా

నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని శనివారం వీఐపీ బ్రేక్‌ సమయంలో దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ పూజారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. తర్వాత ఆలయం ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు బుద్ధి చేప్పినా టీడీపీ నేత ఆయ్యన్న పాత్రుడికి సిగ్గురాలేదని మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అండగా నిలిచారని ఆమె గుర్తుచేశారు.

ప్రజల దృష్టి మరల్చేందుకే బాబు క్షుద్ర రాజకీయం : గుడివాడ అమర్‌నాథ్‌

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబు వికృత రాజకీయానికి తెర తీశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. ఓటమి భయంతోనే గంజాయి దొంగ అయ్యన్నపాత్రుడితో సీఎం వైఎస్‌ జగన్‌ను అసభ్యంగా తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు. ఉండవల్లిలోని అక్రమ నివాసంలో ఉంటూ చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసేందుకు చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే జోగి రమేష్‌పై దాడికి దిగడం దారుణమన్నారు. చంద్రబాబు తన కాపలాకుక్క బుద్ధా వెంకన్న, కాల్‌మనీ బ్యాచ్, టీడీపీ గూండాలను ఉసిగొల్పి దాడి చేయించడంతోపాటు జోగి వాహనాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు క్షుద్ర రాజకీయాలను కట్టిపెట్టాలని హితవు పలికారు.

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టించాలనే టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సప్త వ్యసన పరుడు. సీఎంపై మాట్లాడిన తీరు అమానుషం. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైఎస్సార్‌సీపీకి ఏకపక్ష విజయం వస్తుందని అందరికీ తెలుసు. వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని భావించి టీడీపీ కుట్రలు చేస్తోంది. అయ్యన్న పాత్రుడిని బేషరతుగా అరెస్ట్‌ చేయాలని’’ మంత్రి అవంతి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

అయ్యన్న వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు

అయ్యన్న అన్నం తింటున్నాడా లేక గడ్డి తింటున్నాడా అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. అయ్యన్న అవినీతి, అక్రమాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టమొచి్చనట్లు మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చంద్రబాబు గతంలో దళితులను అవమానించారన్నారు. బీసీలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరితే తోకలు కత్తిరిస్తానని హేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. జోగి రమేష్ పై టీడీపీ నేతలు దాడి చేయడం దుర్మార్గమని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. దిశ ప్రతులు తగలబెట్టిన లోకేష్‌ కూడా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని ఎంపీ నందిగం సురేష్‌ ధ్వజమెత్తారు. అయ్యన్న సంస్కార హీనుడు అంటూ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. వైసీపీ నేతలు చంద్రబాబుపై పరుషంగా మాట్లాడారేగానీ.. ఏనాడూ అసభ్యంగా తిట్టలేదన్నారు.

అయ్యన్నపాత్రుడిపై సొంత తమ్ముడు సన్యాసిపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై సొంత తమ్ముడు సన్యాసిపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చేస్తున్న పరిపాలనను తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మ్మెల్యే జోగి రమేష్ నిరసన చేయాలని చంద్రబాబు ఇంటికి వెళ్లారన్నార. ఆయన మీద తిరగబడి దాడి చేసి.. కారు అద్దాలు ధ్వంసం చేశారన్నారు. బుద్ధా వెంకన్న, టీడీపీకి చెందిన గూండాలు దాడి చేసి ఉద్రిక్తత కల్పించారన్నారు. అసలు నిరసన తెలపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.. దానికి కారణం ఎవరన్నారు. బుద్దా వెంకన్న లాంటి రౌడీలను కాపలా పెట్టుకుని ఇలా దాడి చేశారన్నారు.

నర్సీపట్నం గంజాయి స్మగ్లింగ్ చేసి అయ్యన్నపాత్రుడు డాన్‌గా తయారయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో నర్సీపట్నం మున్సిపల్ మహిళా కమిషనర్‌ని బట్టలు ఊడదీస్తానన్నారన్నారు. అయ్యన్నపాత్రుడు అక్రమాస్తుల చిట్టా తీస్తాం.. దానిలో చంద్రబాబు వాటా ఎంతో తెలుస్తామన్నారు. నిన్న మాట్లాడేటప్పుడు అయ్యన్నపాత్రుడు ఎన్ని పెగ్గులు వేశారని.. పెగ్గేనా, గంజాయి కూడా తీసుకున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం గురించి, తమ నాయకుడి గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు.

అయ్యన్న పాత్రుడి ఇంటి ముట్టడించిన వైసీపీ కార్యకర్తలు

టీడీపీ నేత అయ్యన్న వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు అయ్యన్న పాత్రుడి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులకు ఉమాశంకర్ ఫోన్ చేసి, అయ్యన్నపై ఫిర్యాదు చేశారు.

తన వ్యాఖ్యలపై స్పందించిన అయ్యన్న: దీనిపై విశాఖ నర్సీపట్నంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్న స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ... మంత్రులు చేసిన పనులు మాత్రమే సభలో చెప్పానన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం పద్ధతి కాదు. దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రిని నేను తిట్టలేదు. చర్చిలో ఫాదర్లు ఓ మై సన్‌ అంటారు.. అదే రీతిలో తెలుగులో అన్నాను. నా వ్యాఖ్యలపై వైకాపా శ్రేణులు కావాలనే రచ్చ చేస్తున్నారు. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రుల పనులను బట్టే సంబోధించాను. నా మాటల్లో తిట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.