Amaravati, Sep 20: రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో (AP MPTC ZPTC Election Results) అధికార పార్టీ వైసీపీ అలవోకగా గెలిచింది. 13 జిల్లా పరిషత్తుల్నీ వైసీపీనే చేజిక్కించుకోనుంది. ఎంపీటీసీ స్థానాలనూ ఆ పార్టీ భారీ ఎత్తున (YSRCP on course to landslide victory) గెలిచింది. మొత్తం 515 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించగా ఆదివారం అర్ధరాత్రి వరకూ వెలువడిన ఫలితాల్లో అధికార పార్టీ 627 స్థానాల్ని కైవసం చేసుకుంది.
గట్టి పోటీనిచ్చే ప్రత్యర్థులు లేకపోవడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ విజయం (YSRCP Massive Victory) నల్లేరుపై బండి నడకలా సాగింది. టీడీపీ అభ్యర్థులు ఆరు జడ్పీటీసీ స్థానాల్లోనూ 809 ఎంపీటీసీ స్థానాల్లోనూ విజయం సాధించారు. రెండు, మూడు మండలాల్లో వైసీపీ కంటే తెదేపా ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్ని చేజిక్కించుకుంది. 164 ఎంపీటీసీ స్థానాలు గెలిచి జనసేన మూడో స్థానంలో నిలిచింది.
ది ఫలితాలు వెలువడేసరికి నర్సీపట్నం (విశాఖ జిల్లా), మోపిదేవి (కృష్ణా జిల్లా), గోపవరం (కడప), అగళి (అనంతపురం), వి.ఆర్.పురం (తూర్పుగోదావరి), ఆచంట (పశ్చిమగోదావరి) జడ్పీటీసీ స్థానాల్ని టీడీపీ, అనంతగిరి (విశాఖ జిల్లా) జడ్పీటీసీని సీపీఎం, వీరవాసరం (పశ్చిమగోదావరి) స్థానాన్ని జనసేన గెలుచుకున్నాయి. అనంతపురం జిల్లా రోళ్లలో వైసీపీ తిరుగుబాటు అభ్యర్థి నెగ్గారు.
జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ వైసీపీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. రాష్ట్రంలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలుండగా.. వాటిలో 126 స్థానాలు వైసీపీకు ఏకగ్రీవమయ్యాయి. అభ్యర్థులు చనిపోవడంతో 11 చోట్ల, ఇతర కారణాలతో 8 చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు. 515 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలతో కలిపి 637 జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు వెల్లడి కాగా వాటిలో 627 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుని తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది.
రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాల్లో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అభ్యర్థులు చనిపోవడంతో 81 చోట్ల, ఇతర కారణాల వల్ల 376 చోట్ల ఎన్నికలు జరగలేదు. 7,220 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో అధికార పార్టీ తన హవాను కొనసాగించింది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ఏకంగా 8,075 ఎంపీటీసీ స్థానాలు (ఏకగ్రీవాలతో కలిపి) గెలుచుకుని విజయ ఢంకా మోగించింది.
ఏప్రిల్ 1న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పరిషత్ ఎన్నికలకు రెండోసారి నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘ ఏకపక్ష నిర్ణయం, ప్రభుత్వ అప్రజాస్వామిక, అరాచక విధానాలకు పాల్పడిందని ఆరోపిస్తూ పరిషత్ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఎన్నికల్ని టీడీపీ బహిష్కరించినప్పటికీ.. నామినేషన్ల ప్రక్రియ గత ఏడాది మార్చిలోనే పూర్తవడం, అప్పట్లో ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచే మళ్లీ కొనసాగించడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీలో కొనసాగినట్టయింది.
ఇప్పటివరకు వెల్లడైన ఎంపీటీసీ స్థానాల ఫలితాలు ఇలా ఉన్నాయి.
కృష్ణా: 648 ఎంపీటీసీ స్థానాల్లో 568 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలుపు.
ప్రకాశం: 784 ఎంపీటీ\సీ స్థానాల్లో 668 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయకేతనం
నెల్లూరు: 562 ఎంపీటీసీ స్థానాల్లో 400 వైఎస్సార్‌సీపీ 312 సొంతం చేసుకుని తిరుగులేని విజయం సొంతం చేసుకుంది.
తూర్పు గోదావరి: 998 స్థానాల్లో 538 సొంతం చేసుకున్న వైఎస్సార్‌సీపీ.
పశ్చిమ గోదావరి: 781 స్థానాల్లో 577 వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.
విశాఖపట్టణం: 612 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ 450 గెలుచుకుంది.
విజయనగరం: 549 ఎంపీటీసీ స్థానాల్లో 433 వైఎస్సార్‌సీపీ కైవసం
శ్రీకాకుళం: 668 ఎంపీటీసీ స్థానాల్లో 562 వైఎస్సార్‌సీపీ గెలుపు.
వైఎస్సార్ కడప: 549 స్థానాల్లో 433 వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.
అనంతపురం: 841 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ 763 సొంతం చేసుకుంది.
చిత్తూరు: 886 ఎంపీటీసీ స్థానాల్లో 822 సొంత చేసుకుని వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది.
కర్నూలు: 807 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 718 గెలుపొందింది.