Rajendra Prasad Shocking Comments on Allu Arjun: ‘వాడెవడో చందనం దొంగ.. వాడు ఇప్పుడు హీరో అట..!’.. అల్లు అర్జున్, పుష్పపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (వీడియో)

రాజేంద్రప్రసాద్‌ తో పాటు శ్రీరామ్‌, మౌనిక రెడ్డి, అర్జున్‌ అంబటి, రుచిర సాధినేని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Rajendra Prasad (Credits: X)

Hyderabad, Dec 10: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) తాజాగా `హరికథ` అనే వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషించారు. రాజేంద్రప్రసాద్‌ తో పాటు శ్రీరామ్‌, మౌనిక రెడ్డి, అర్జున్‌ అంబటి, రుచిర సాధినేని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పుడు సినిమాల కథలు పూర్తిగా మారిపోయాయి.. వాడెవడో చందనం దొంగ.. వాడు ఇప్పుడు హీరో అట’ అంటూ నోరు జారారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

పుష్ప చిత్రంలో విలన్ గా నటించిన తారక్ పొన్నప్పకు క్రికెటర్ కృనాల్ పాండ్యాకు ఉన్న రిలేషన్ ఏంటి..? నెటిజన్లు ఎందుకు అతడిని కృనాల్ పాండ్యాతో కలుపుతున్నారు..

Here's Video:

పాజిటివ్ గా ఉండే వ్యక్తి..

`పుష్ప 2` సిరీస్ లో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌ గా ఎర్రచందనం స్మగ్లర్‌ గా నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ పైనే రాజేంద్ర ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.  కాగా, రాజేంద్రప్రసాద్‌ చాలావరకు వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రెస్‌ మీట్‌ ఏదైనా అందరిపై తాను పాజిటివ్‌ గా మాట్లాడుతారు.  కానీ ఆయన ఉన్నట్టుండి ఇలా బన్నీపై నోరు జారడం కలకలం రేపుతున్నది.

ఆర్బీఐ నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా, రిజర్వ్ బ్యాంకుకు 26వ గవర్నర్ గా సేవలు అందించనున్న ఐఏఎస్ అధికారి