Adipurush Controversy Dialogue: ఆదిపురుష్‌లో సీత భారత పుత్రిక డైలాగ్‌పై వివాదం, నేపాల్‌లో సినిమాపై పెల్లుబికిన ఆగ్రహం, దాన్ని తీసేయాలని డిమాండ్
గతంలో ఈ సినిమా కొన్ని వివాదాలను ఎదుర్కొంది. ఇప్పుడు ఈ సినిమాపై నేపాల్‌లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 'ఆదిపురుష్' సినిమాలో సీతపై ఓ డైలాగ్ నేపాల్‌లో ఆగ్రహానికి కారణమైంది.
ఆదిపురుష్ సినిమా 7000 స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదలైంది. గతంలో ఈ సినిమా కొన్ని వివాదాలను ఎదుర్కొంది. ఇప్పుడు ఈ సినిమాపై నేపాల్‌లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 'ఆదిపురుష్' సినిమాలో సీతపై ఓ డైలాగ్ నేపాల్‌లో ఆగ్రహానికి కారణమైంది. ఆదిపురుష్ సినిమాలో సీతా దేవి భారతదేశపు కుమార్తె అని డైలాగ్ చెబుతూ ఓ సన్నివేశం ఉంటుంది. దీనిని నేపాల్ సెన్సార్ బోర్డు తప్పుబట్టింది. సీతా దేవి నేపాల్‌లో జన్మించిందని వారి నమ్మకం. దీంతో అక్కడ సినిమా రిలీజ్ కాలేదు. ఖాట్మండులోని కొన్ని థియేటర్లలో ఆదిపురుష్ సినిమాను బ్యాన్ కూడా చేశారు.
ఆ డైలాగ్‌ను తొలగించాల్సిందిగా మూవీ మేకర్స్‌ను వారు కోరారు. దీంతో వివాదానికి కారణమైన డైలాగ్స్‌ను మేకర్స్ తొలగించారు. అనంతరం నేపాల్‌లో మూవీ విడుదలకు లైన్ క్లియర్ అయింది. కానీ మార్నింగ్ షోలు ఆగిపోయాయి. మరి కొన్ని గంటల్లో అక్కడ మెదటి షో పడనుంది. సీతాదేవి నేపాల్ కుమార్తెగా వారు భావిస్తారు కాబట్టి అక్కడ మొదటి నుంచి ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే అక్కడ టికెట్లు కూడా భారీగా అమ్ముడుపోయాయి.
Here's Tweet
ఖాట్మండు మెట్రోపాలిటన్ సిటీ మేయర్ బాలెన్ షా మాట్లాడుతూ.. ‘‘ఆదిపురుష్ సినిమాలో సీత డైలాగ్‌ని సరిగ్గా చెప్పలేదు,''సినిమాలో జానకి ఇండియా కూతురు అని ఉంది. ఇది నిజం కాదు, జానకి నేపాల్ కూతురు.. ఆదిపురుష్ ఈ తప్పును సినిమాలో సరిదిద్దలేదు. ఖాట్మండులో విడుదల చేయబడదని తెలిపారు. అదే కారణంతో నేపాల్ సెన్సార్ బోర్డ్ కూడా ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని నిర్ణయించింది.
దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన చిత్రం 'ఆదిపురుష్'. ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ అతుల్, సచేత్ పరంపర ఈ చిత్రానికి సంగీతం అందించారు.